TTD: బ్రహ్మండనాయకుని బ్రహ్మోత్సవం - భక్తులకు అభయం..!!

Tirumala: తిరుమలలో బ్రహ్మోత్సవాల శోభతో భక్తులను ఆహ్వానిస్తోంది. భక్తుల రద్దీ కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాల వేళ శ్రీవారిని దర్శించుకొనేందుకు భక్తులు బారులు తీరారు. సోమవారం ప్రారంభమైన బ్రహ్మోత్సవాల వేళ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు అందించారు. తొలి రోజు స్వర్ణశేషవాహనంపై(పెద్ద శేషవాహనం) వైకుంఠనాథుని అలంకారంలో శ్రీవారు తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు.

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కనులపండుగగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో తొలి రోజున శ్రీవారిని 62,745 మంది భక్తులు దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన సోమవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణశేషవాహనంపై(పెద్ద శేషవాహనం) వైకుంఠనాథుని అలంకారంలో తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు. ఈ వాహస సేవ కోసం మాడ వీధుల్లో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడుగా చెబుతారు. ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు.

Huge number of devotees witnessed the procession of Sri Vaikunthanadha on China Sesha Vahanam in Brahmotsavams

ఈ రోజు (మంగళవారం) ఉదయం చిన్నశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి విహరించారు. వాహన సేవను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. చిన్నశేష వాహనం పై నుంచి స్వామి వారు భక్తులకు అభయ ప్రధానం చేసారు. ఈ రోజు రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందు చేయనున్నారు. బ్రహ్మోత్సవాల వేళ సీఎం జగన్ ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి స్వామి వారి ప్రసాదం అందచేసి ఆశీర్వదించారు. ఇక, బ్రహ్మోత్సవాల సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాల సిఫార్సు లేఖలు..సేవలను టీటీడీ రద్దు చేసింది. సామాన్యులకు శ్రీవారి దర్శనం చేసుకొనేందుకు వీలుగా 1.30 లక్షల టికెట్లను అందుబాటులోకి తెచ్చింది.

ఈ బ్రహ్మోత్సవాల వేళ భక్తుల సంఖ్య పెరుగుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి వాహన సేవల్లో మెరుగైన దర్శనం, గదులు, అన్నప్రసాదాలు, లడ్డూలు, సామాన్య భక్తులకు భద్రత కల్పించేందుకు టీటీడీ అన్ని విధాలా కృషి చేస్తుందని ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి వెల్లడించారు. భక్తులకు గ్యాలరీల నుంచి శ్రీవారి వాహన సేవలను తిలకించేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+