ముఖేష్ హంగామా, చేయి చూపిన జయసుధ(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణలో నామినేషన్లు బుధవారం హోరెత్తాయి. నామినేషన్ల ఘట్టం చివరి రోజు కావడంతో ఊహించని విధంగా నామినేషన్లు దాఖలయ్యాయి. 17 లోకసభ స్థానాలకు, 119 శాసనసభ స్థానాలకు బుధవారం పెద్ద మొత్తంలో నామినేషన్లు దాఖలయ్యాయి.
పార్టీల అభ్యర్ధులు కూడా పూర్తిగా ఖరారుకాని నేపథ్యంలో కొంతమంది ఆశావహులు అదనంగా నామినేషన్లను దాఖలు చేయగా, రెబల్స్ అభ్యర్ధులుగా మరికొంతమంది బరిలోకి దిగడం, స్వతంత్ర అభ్యర్ధులు కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపించడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.
నిజామాబాద్‌లో గల్ఫ్ బాధితులు తమకు జరిగిన అన్యాయంపై నిరసన వ్యక్తం చేస్తూ అక్కడి పార్లమెంట్ స్థానానికి పెద్ద సంఖ్యలో మూకుమ్మడి నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు శాసనసభ నియోజకవర్గంలో కూడా స్వతంత్ర అభ్యర్ధులు 33 మంది నామినేషన్లు దాఖలు చేయడం విశేషం.

పొన్నాల
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బుధవారం జనగామ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యం.

ఎర్రబెల్లి
తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు బుధవారం పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యం.

శ్రీధర్ బాబు
తెలంగాణ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి శ్రీధర్ బాబు బుధవారం మంథని అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యం.

కెటి రామారావు
తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు బాబు బుధవారం సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యం.

పొన్నం
తెలంగాణ ప్రాంత కాంగ్రెసు సీనియర్ నాయకుడు పొన్నం ప్రభాకర్ బుధవారం కరీంనగర్ లోకసభ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యం.

ముఖేష్ గౌడ్
తెలంగాణ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ బుధవారం గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యం.

నారాయణ
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ బుధవారం ఖమ్మం లోకసభ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యం. ఆయన మార్నింగ్ వాక్‌లోను ఓటర్లను కలుసుకున్నారు.

మర్రి
తెలంగాణ కాంగ్రెసు పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి బుధవారం సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యం.

పద్మిని
మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మెదక్ జిల్లాలోని ఆందోల్ అసెంబ్లీకి నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యం. వెంట ఆయన భార్య పద్మిని ఉన్నారు.

డికె అరుణ
తెలంగాణ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి డికె అరుణ బుధవారం గద్వాల అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యం.

కిషన్ రెడ్డి
భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు గంగారపు కిషన్ రెడ్డి అంబరుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యం.

విహెచ్
తెలంగాణ కాంగ్రెసు పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు బుధవారం అంబరుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యం.

కె లక్ష్మణ్
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ కె లక్ష్మణ్ ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యం.

ముఖేష్ గౌడ్
తెలంగాణ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ బుధవారం గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ర్యాలీగా వచ్చి హంగామాగా నామినేషన్ దాఖలు చేశారు.

ట్రాఫిక్ జాం
తెలంగాణలో నామినేషన్లు బుధవారం హోరెత్తాయి. నామినేషన్ల ఘట్టం చివరి రోజు కావడంతో ఊహించని విధంగా నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల దాఖలుతో పలుచోట్ల ట్రాఫిక్ జాం అయింది.

నల్లు ఇంద్రసేనా రెడ్డి
భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి నల్లు ఇంద్రసేనా రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యం.

సర్వే సత్యనారాయణ
కేంద్రమంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ బుధవారం మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యం.

జయసుధ
కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ బుధవారం సికింద్రాబాద్ అసెంబ్లీకి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం అభివాదం చేస్తూ...

కల్వకుంట్ల కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యం.

నాగం జనార్ధన్ రెడ్డి
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి నాగర్ కర్నూలు లోకసభ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యం.

జానా రెడ్డి
తెలంగాణ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి జానా రెడ్డి బుధవారం నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యం.

ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యం.

కోమటిరెడ్డి వెంకట రెడ్డి
కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యం.

నామినేషన్ వేసేందుకు..
తెలంగాణలో నామినేషన్లు బుధవారం హోరెత్తాయి. నామినేషన్ల ఘట్టం చివరి రోజు కావడంతో ఊహించని విధంగా నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ వేసేందుకు బైక్ పైన వస్తున్న దృశ్యం.

తలసాని
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యం.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications