ట్రయాంగిల్ లవ్‌: ప్రేమించి పెళ్ళి,ట్విస్టిచ్చిన భార్య, 3 నెలలకే భర్త సూసైడ్

Posted By:
Subscribe to Oneindia Telugu

కర్నూల్:ప్రేమించి పెళ్ళి చేసుకొన్నాడు. కానీ, ఆ యువతి మరో యువకుడితో ప్రేమలో ఉంది. కానీ మరో యువకుడితో వివాహం చేసుకొంది. వివాహం చేసుకొన్నా భర్తతో కాపురం చేయలేదు. విడాకులు కావాలని భర్తతో గొడవకు దిగేది. ఈ కారణంగానే పెళ్ళైన మూడు మాసాలకే వినయ్‌కుమార్ రైలు కింద పడి ఆత్మహత్మకు పాల్పడిన ఘటన కర్నూల్ జిల్లాలో చోటు చేసుకొంది.ఈ ఘటనతో మృతుడి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కొడుకు మృతికి కోడలు, ఆమె కుటుంబసభ్యులే కారణమని వారు ఆరోపిస్తున్నారు.

కర్నూల్ పట్టణానికి సమీపంలోని ఓ ఫ్యాక్టరీ వద్ద రైలు కింద పడి 24 ఏళ్ళ యువకుడు వినయ్‌కుమార్ సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు .అతడికి వివాహమై అప్పటికి మూడు మాసాలు మాత్రమే అవుతోంది.

భార్య, భర్తల మధ్య విభేధాల కారణంగానే పెళ్ళి కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబసభ్యులు చెప్పారు. ప్రేమించి పెళ్ళి చేసుకొన్న తర్వాత కోడలు తన కొడుకును విడాకులు ఇవ్వాలని ఇబ్బంది పెట్టడంతోనే తమ కొడుకు ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబసభ్యులు చెబుతున్నారు.

పెళ్లైన మూడు మాసాలకే పెళ్ళి కొడుకు ఆత్మహత్య

పెళ్లైన మూడు మాసాలకే పెళ్ళి కొడుకు ఆత్మహత్య

కర్నూల్ జిల్లా గోనెగండ్లకు చెందిన యువకుడు వినయ్‌కుమార్ ఎంబీఏ చదువుకొన్నాడు. ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. ఉద్యోగం రాకపోవడంతో పత్తికొండలో కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు. వెల్ధూర్తికి చెందిన సౌజన్యను వినయ్‌కుమార్ ప్రేమించి 2017 నవంబర్ 1వ, తేదిన వివాహం చేసుకొన్నాడు. కానీ, అప్పటికే ఆ యువతి మరో యువకుడితో ప్రేమలో ఉంది.

భర్తతో రోజూ గొడవలు

భర్తతో రోజూ గొడవలు

వేరే యువకుడితో ప్రేమలో ఉన్న కారణంగా పెళ్ళైన నాటి నుండి సౌజన్య భర్త వినయ్‌కుమార్‌‌ను విడాకులు ఇవ్వాలని గొడవకు దిగింది. ఈ విషయమై భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. 20 రోజుల క్రితం సౌజన్య పుట్టింటికి వెళ్ళింది. ఫిబ్రవరి 12వ, తేదిన భార్యకు ఆరోగ్యం బాగా లేదని ఆమె కుటుంబసభ్యులు వినయ్‌కుమార్ కు సమాచారం ఇచ్చారు. అతను వచ్చి ఆసుపత్రిలో సౌజన్యను యోగక్షేమాలు కనుకొన్నాడు.

ఆసుపత్రిలో భార్యభర్తల మధ్య గొడవ

ఆసుపత్రిలో భార్యభర్తల మధ్య గొడవ

కర్నూల్‌లో ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన భార్య సౌజన్యతో మాట్లాడిన తర్వాత విడాకుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు మృతుడి సోదరుడు వంశీ చెబుతున్నారు. ఆసుపత్రిలో చెకప్ పూర్తైన తర్వాత సౌజన్య తన తల్లితో కలిసి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. పెళ్ళై మూడు మాసాలు కాలేదు, భార్య విడాకులు కోరడమే కాకుండా గొడవకు దిగడంతో వినయ్‌కుమార్ మనోవేదనకు గురయ్యాడు.

రైలు కిందపడి ఆత్మహత్య

రైలు కిందపడి ఆత్మహత్య

తల్లితో కలిసి భార్య పుట్టింటికి వెళ్ళడంతో వినయ్ కుమార్ మనోవేదనకు గురయ్యాడు. చిన్న పనుందని తమ్ముడికి చెప్పి కార్బైడ్ ఫ్యాక్టరీ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి జేబులో లభించిన సమాచారం మేరకు పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.తన కొడుకు మృతికి కోడలే కారణమని వినయ్‌కుమార్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 24 year old man committed suicide on Monday night in Kurnool. Three months back he was married a lady from Veldurthi village of Kurnool district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి