అనుమానంతో ఆ ఇల్లాలిని కాటేసింది: రోకలిబండతో తల పగలకొట్టి హత్య!..

జాన్‌పికిల్‌ భార్య కళావతి(35) ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేసి ఇటీవలే మానేసింది. అయితే భార్యపై అనుమానం పెంచుకున్న జాన్‌పికిల్‌ నిత్యం ఆమెను వేధిస్తూ వస్తున్నాడు.

వినుకొండ: భర్త అనుమానం ఓ ఇల్లాలిని కాటేసింది. అనుమానంతో నిత్యం వేధించడం.. తరుచూ గొడవకు దిగడం అతనికి అలవాటుగా మారిపోయింది. ఇదే క్రమంలో బుధవారం రాత్రి కూడా భార్యతో గొడవ పెట్టుకున్న భర్త.. తీవ్ర ఆగ్రహంతో ఆమెను రోకలిబండతో కొట్టి చంపేశాడు.

గుంటూరు జిల్లా వినుకొండలో ఈ దారుణం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు పరిశీలిస్తే.. వినుకొండ పట్టణంలోని ఎన్‌ఎస్పీ కాలనీలో ఉన్న మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో దండే జాన్‌పికిల్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. స్థానికంగా ఉన్న కాంపౌండ్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు.

husband suspects wife of affair, kills her at home

జాన్‌పికిల్‌ భార్య కళావతి(35) ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేసి ఇటీవలే మానేసింది. అయితే భార్యపై అనుమానం పెంచుకున్న జాన్‌పికిల్‌ నిత్యం ఆమెను వేధిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి కూడా వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన జాన్‌పికిల్‌ రోకలిబండతో భార్యపై దాడి చేశాడు.

తలకు తీవ్రంగా గాయాలవడంతో భార్య అక్కడిక్కడే మృతి చెందింది. భార్యను హత్య చేసిన తర్వాత జాన్‌పికిల్‌ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. వీరిద్దరికి మూడేళ్ల బాబు, ఏడాదిన్నర వయసున్న పాప ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న వినుకొండ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+