భార్య నగ్న చిత్రాలు నెట్లో పెడతానని భర్త బెదిరింపు!
హైదరాబాద్: తనకు విడాకులు ఇవ్వకుంటే నగ్న చిత్రాలను నెట్‌లో పెడతానని ఓ భర్త భార్యను బెదిరించాడట. వీరిద్దరికి కొద్ది రోజుల క్రితమే పెళ్లి జరిగింది. నెల రోజులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత విడాకులిమ్మంటూ భార్యను నిత్యం వేధించడం ప్రారంభించాడట.
విడాకులివ్వకపోతే, నీ నగ్న చిత్రాలను నెట్‌లో పెడతానంటూ బెదిరిస్తున్నాడట. దీంతో ఖంగుతిన్న భార్య పోలీసులను ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. ఈ సంఘటన హైదరాబాదు పరిసరాల్లో జరిగింది.

వీరికి ఆరు నెలల క్రితం పెళ్లయింది. నెల రోజులు సాఫీగా సాగింది. ఆ తర్వాత నుండి భర్త నుండి వేధింపులు ప్రారంభమయ్యాయి. భార్యకు తెలియకుండానే ఆమె నగ్న చిత్రాలు తీశాడట. విడాకులివ్వకుంటే వాటిని నెట్‌లో పెడతానంటూ బెదిరిస్తున్నాడట. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.












Click it and Unblock the Notifications