విజయ్ ఆత్మహత్య, భర్తను చంపిన స్వాతి: ఆయన రివర్స్ పంచ్
విశాఖపట్నం: హాస్య నటుడు విజయ్ సాయి ఆత్మహత్య ఉదంతంలో విశాఖపట్నానికి చెందిన ఎన్జీవో ప్రతినిధి రివర్స్ పంచ్ ఇచ్చారు. వివాహిత పురుషులు తమ భార్యల చేతుల్లో బాధితులుగా మారుతున్నారని సేవ్ ఇండియన్ ఫ్యామిలీ (ఎస్ఐఎప్) ఎపి, తెలంగాణ చాప్టర్ నేత వెంకట మోహన్ రావు అన్నారు.
Recommended Video

భార్యల చట్టబద్దమైన బలవంతపు వసూళ్లకు, అక్రమ సంబంధాలకు పురుషులు బలి అవుతున్నారని ఆయన ఆరోపించారు. విజయ్ సాయి ఆత్మహత్య నేపథ్యంలో ఆయన వనితా రెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

భారీగా నగదు డిమాండ్
తన భార్య వనితా రెడ్డి, ఆమె న్యాయవాది గృహ హింస కేసును ఉపసంహరించకోవడానికి తనను పెద్ద మొత్తంలో డబ్బు అడిగారని విజయ్ సాయి తన సెల్ఫీ వీడియోలో చెప్పిన విషయం తెలిసిందే. భార్య వనితా రెడ్డి వేధింపులతో మానసిక హింసకు గురై విజయ్ సాయి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడని వెంకట మోహన్ రావు ఆరోపించారు.

మూడు కోట్లు డిమాండ్
విజయ్ సాయితో విడిపోయిన వనితా రెడ్డి ఇంట్లోంచి ఖరీదైన వస్తువులను తీసుకని వెళ్లిందని, దానికితోడు గృహ హింస కేసు పెట్టిందని, పైగా కేసు ఉపసంహరించుకోవడానికి 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని వెంకట మోహన్ రావు అన్నారు.

విజయ్ సాయి అంత్యక్రియల్లో పాల్గొని...
హైదరాబాదులో విజయ్ సాయి అంత్యక్రియల్లో వెంకట మోహన రావు పాల్గొన్నారు. వనితా రెడ్డి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు ఏమిటో ఆయన కుటుంబ సభ్యులు చెప్పారని వెంకట మోహన రావు చెప్పారు. వనితా రెడ్డిపై పోలీసులు ఏ విధమైన చర్యలు కూడా తీసుకోలేదని ఆయన విమర్శించారు.

వీడియోలు పోస్టు చేయడంలో....
సానుభూతిని పొందడానికి, చట్టం నుంచి తప్పంచుకోవడానికి వనితా రెడ్డి వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంలో అర్థం లేదని వెంకట మోహన్ రావు అన్నారు. విజయ్ సాయి ఆత్మహత్యతో తనకు సంబంధం లేదని, ఆయన వివాహేతర సంబంధాలే అందుకు పురికొల్పి ఉంటాయని వనితా రెడ్డ చెబుతోందని ఆయన అన్నారు.

వివాహేతర సంబంధాలే కారణం...
వివాహిత పురుషులు బలి కావడానికి వివాహేతర సంబంధాలు కారణమవుతున్నాయని వెంకట మోహన్ రావు అన్నారు. స్వాతి రెడ్డి తన భర్త సుధాకర్ రెడ్డిని సినిమాలో మాదిరిగా హతమార్చిన ఉదంతాన్ని కూడా ఆయన ఉదహరించారు. ఇటువంటి సంఘటనల వల్ల వివాహ వ్యవస్థ మీద విశ్వాసం సన్నగిల్లుతుందని ఆయన అన్నారు.
-
'బైకర్' ట్రైలర్ రిలీజ్.. శర్వానంద్ ఈసారి హిట్ కొట్టేశాడోచ్..! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ












Click it and Unblock the Notifications