వానే వాన: హైదరాబాద్ జీవితం అస్తవ్యస్తం (పిక్చర్స్)

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ జనజీవితం అస్తవ్యస్తంగా మారింది. హైదరాబాద్‌కు విజయవాడ నుంచి, వరంగల్ నుంచి వచ్చే ట్రాఫిక్‌కు చెరువులు ఉప్పొంగడం వల్ల, రోడ్లు తెగడం వల్ల అంతరాయం ఏర్పడింది. ఉప్పల్ వద్ద చెరువు పొంగిపొర్లుతోంది. దీంతో శనివారంనాడు హైదరాబాద్ వచ్చే ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. శ్రీశైలం నుంచి వచ్చే ట్రాఫిక్‌కు కూడా అంతరాయం ఏర్పడింది.

హైదరాబాదులోని మీరాలం చెరువు, తదితర చెరుపులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హైదరాబాద్ శుక్రవారంనాడే జల దిగ్భంధమైంది. ఎటు చూసినా వర్షపు నీరు చిన్నసైజు చెరువుల్లా కన్పిస్తున్నాయి. శుక్రవారం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురుస్తూనే ఉండటంతో హుస్సేన్‌సాగర్ నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది.

శుక్రవారం నగరంలోని పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. అంతేగాక, జోన్ల వారీగా ఉన్న ఎమర్జెన్సీ బృందాలను, అలాగే రెడ్‌హిల్స్‌లోని సెంట్రల్ ఎమర్జెన్సీ బృందాలను కూడా అప్రమత్తం చేశారు. నాలుగు రోజుల నుంచి రోడ్లపై ఎక్కడి వర్షపునీరు అక్కడే నిల్చి ఉండటంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు కూడా లేకపోలేవు

లంగర్‌హౌజ్, నాగమయ్యకుంట, బోయిన్‌పల్లి తదితర ప్రాంతాలతో పాటు శివార్లలోని వనస్థలిపురం, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లోని పలు ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు చేరింది. లంగర్‌హౌజ్ సమీపంలోని హరిదాస్‌పురా, లక్ష్మీనగర్, ప్రశాంత్‌నగర్ ప్రాంతాల్లో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరటంతో ఇంట్లో నిత్యావసర సరుకులు కొట్టుకుపోయినట్లు స్థానికులు వాపోయారు.

మోకాలు లోతు నీరు..

మోకాలు లోతు నీరు..

హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాల్లో మోకాలు లోతు నీరు చేరుకుంది. ఇళ్లలోకి కూడా ఇలా నీరు వచ్చి చేరింది. హైదరాబాదీల దైనందిన జీవితం కష్టాల కడలిగా మారింది. బంజారా కాలనీ ఇలా కనిపించింది.

రోడ్డు నదిగా మారిపోయింది

రోడ్డు నదిగా మారిపోయింది

దిల్‌షుక్‌నగర్‌లోని ఓ బస్తీలో రోడ్డు నదిలా మారింది. ఇళ్ల నుంచి కదలలేని స్థితి ఏర్పడింది. ఎక్కడ చూసినా నీళ్లే

నీళ్లలో హయత్‌నగర్ డిపో..

నీళ్లలో హయత్‌నగర్ డిపో..

రంగారెడ్డి జిల్లాలోని హయత్‌నగర్ ఆర్టీసి బస్సు డిపో నీటితో నిండిపోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

నీటి ప్రవాహంలో ఇలా...

నీటి ప్రవాహంలో ఇలా...

హయత్‌నగర్‌లో ఇలా నీరు వచ్చి చేరింది. పరిస్థితులను పర్యవేక్షిస్తూ స్థానిక శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఇలా తిరుగుతూ కనిపించారు.

ఇళ్లు చెరువు..

ఇళ్లు చెరువు..

బంజారా కాలనీలో ఇళ్లు చెరువుగా మారింది. నిలబడ్డానికి, కూర్చోవడానికి కూడా చోటు లేకుండా పోయింది.

నీళ్లలోనే ప్రయాణం తప్పదు..

నీళ్లలోనే ప్రయాణం తప్పదు..

కోదండరామ్ నగర్ నీటితో అతలాకుతలంగా మారింది. ఎక్కడ ఓ బొంద ఉందో తెలియదు. అయినా వాహనంపై ఇలా వెళ్లక తప్పదా..

నీళ్లు తప్ప మరేదీ లేదు..

నీళ్లు తప్ప మరేదీ లేదు..

నీళ్లు తప్ప రోడ్లపై మరేమీ కనిపించడం లేదు. నీళ్లలో వాహనాలు ఇలా సాగుతూనే ఉన్నాయి. జీవన యానం తప్పదు కదా..

తడిసి ముద్దయి...

తడిసి ముద్దయి...

వానలో తడిసి ముద్దవుతూ, రోడ్లపై ప్రవహిస్తున్న నీటిలో ముందుకు సాగుతూ సాధారణ ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఇలా

నీళ్లు ఎత్తిపోస్తూ...

నీళ్లు ఎత్తిపోస్తూ...

ఇళ్లలోకి చేరిన నీటిని ఎత్తిపోయడానికి రెక్కలు ముక్కలు చేసుకుంటూ ఓ ముసలమ్మ ఇలా కనిపించింది. మన్సూరాబాద్ దృశ్యం ఇది.

ఓల్డ్ మలక్‌పేటలో..

ఓల్డ్ మలక్‌పేటలో..

హైదరాబాదులోని ఓల్డ్ మలక్‌పేట వరదలకు అతలాకుతలమైంది. మోకాలు లోతు నీటిలో ప్రజలు ఇలా బిక్కు బిక్కుమంటూ కనిపించారు.

వరదలే వరదలు...

వరదలే వరదలు...

సరూర్‌నగర్ చెరువు కింద ఉండే పి అండ్ టీ కాలనీ పరిస్థితి గుండె చెరువైంది. ప్రజలు నీటిలో ఇలా తిప్పలు పడుతూ కనిపించారు.

పి అండ్ టీ కాలనీలోనే...

పి అండ్ టీ కాలనీలోనే...

గొడుగులు చేత బూని, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పి అండ్ టీ కాలనీవాసులు ఇలా... అంతా నీరే.. ఎలా నీరు మాయమవుతుందో తెలియదు..

గుండె చెరువై...

గుండె చెరువై...

కాలనీలో ఇలా నీరు వచ్చి చేరింది. పిల్లలు, పెద్దలు బతుకు జీవుడా అంటూ ఇలా కనిపించారు. ఇది కూడా పి అండ్ టీ కాలనీ దృశ్యమే..

ఎంత షోకు చేస్తేనేం..

ఎంత షోకు చేస్తేనేం..

ఎంత షోకుగా భవనాలు కడితేనేం.. ఎడతెరిపి లేని వర్షాలకు కింది భాగాల్లో నీళ్లు వచ్చి చేరాయి. బతుకు జీవుడా అంటూ రోదించక తప్పని పరిస్థితి.

ఒకప్పుడు ఇవి పొలాలు..

ఒకప్పుడు ఇవి పొలాలు..

సరూర్ నగర్ చెరువు కింద ఈ స్థలాల్లో గతంలో పొలాలు ఉండేవి. వరి పంట వేసేవారు. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో కాంక్రీట్ భవనాలు వెలిసేవి. వానపడితే ఇలా తయారయ్యాయి..

తోయాల్సిందే..

తోయాల్సిందే..

వరద నీటిలో వాహనాలనే కాదు, జీవితాలనూ తోయాల్సిందే.. కాలనీలో నీరు చేరిపోయి ఇంట్లో ఉండలేక, బయటకు రాలేక ఇలా ప్రజలు..

రామంతపూర్‌లో...

రామంతపూర్‌లో...

హైదరాబాదులోని రామంతపూర్ టీవి కాలనీలో ఇలా ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. నీటిని ఎత్తిపోయక తప్పడం లేదు.

చెరువా, కాలనీయా..

చెరువా, కాలనీయా..

అది చెరువో, ప్రజలు నివాసం ఉండే కాలనీయో తెలియనంతగా వరదల్లో నివాసాలు మునిగిపోయాయి. బతుకు జీవుడా అంటూ ప్రజలు కనాకష్టాలు పడుతూ.

బతుకు తడి..

బతుకు తడి..

ఇళ్లే కాదు, బతుకులూ తడిసిపోయాయి.. ఇంట్లో నీరు చేరి ముద్దముద్దయితో చేతులు ఆడవు, కాళ్లు కదలవు.. చూడండి...

సీసల బస్తీలో...

సీసల బస్తీలో...

సీసల బస్తీలో ఇలా నీళ్లు చేరిపోయాయి. హైదరాబాదులోని బస్తీలు చాలా వరకు నీట మునిగిపోయాయి.

వనస్థలిపురంలో...

వనస్థలిపురంలో...

హైదరాబాదులోని వనస్థలిపురం కూడా జలమయమైంది. జలాలతో నిండిపోయిన రోడ్లపై జీవనం అస్తవ్యస్తంగా మారింది.

ఇంటిలోకి నీరు చేరి..

ఇంటిలోకి నీరు చేరి..

ఇళ్లలోకి మోకాలు లోతు నీరు రావడంతో ఏం చేయాలో తెలియని దిక్కు తోచని పరిస్థితిలో వనస్థలిపురం వాసులు బిక్కుబిక్కుమన్నారు

పొంగిపొర్లిన హుస్సేన్ సాగర్

పొంగిపొర్లిన హుస్సేన్ సాగర్

హుస్సేన్ సాగర్ వర్షాల తాకిడికి పొంగిపొర్లుతున్నట్లు తయారైంది. హైదరాబాద్ నగర మేయర్ పరిస్థితిని సమీక్షించారు.

హుస్సేన్ సాగర్ నాలా..

హుస్సేన్ సాగర్ నాలా..

హుస్సేన్ సాగర్‌లోకి వరదలు వచ్చి చేరుతున్నాయి. దీంతో అది కళకళలాడుతూ కనిపించింది. ఒకప్పుడు దీని నుంచే హైదరాబాదుకు మంచినీరు సరఫరా అయ్యేది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+