స్ట్రోక్ తప్పించుకోవాలంటే, మందులతో కాదు- వైద్య నిపుణుల కీలక సూచనలు..!!
ఈ మధ్య కాలంలో స్ట్రోక్స్ పెరిగాయి. వయసుతో సంబంధం లేకుండా ప్రాణాలు తీస్తున్నాయి. ఇందుకు వైద్యులు అనేక కారణాలను విశ్లేషిస్తున్నారు. అయితే, సమస్య వచ్చిన సమయంలో చికిత్స.మందులు ఎంత అవసరమో..సమస్య రాకుండా ఉండేలా ముందస్తు జాగ్రత్తలు బిగ్ రిలీఫ్ ఇస్తాయంటున్నారు వైద్యులు. ఒత్తిడి.. నిద్ర లేమి..శారీరక శ్రమ లేకపోవటం..ఆహారపు అలవాట్లు..ఇలా ఎన్నో కారణాలు సైలెంట్ గా ప్రాణాలను హరించటానికి కారణాలు అవుతున్నాయి.
ఈమధ్య కాలంలో ఆరోగ్య సమస్యలు చాలా పెరిగిపోయాయి. కరోనా తరువాత గుండె, నాడీ వ్యవస్థకు సంబంధించిన అనేక సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. కొంత మంది వీటి కారణంగా ప్రాణాలు కూడా కోల్పోయారు. దీంతో అందరిలోనూ ఆరోగ్యం పైన అవగాహన పెంచుకోవాలనే తపన పెరిగింది. అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకుంటున్నారు. తాజాగా ఒక వ్యక్తి హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ కు వెళ్ళి అక్కడ న్యూరాలజిస్ట్ గా పనిచేస్తున్న డాక్టర్ సుధీర్ కుమార్ ను కలిసారు. తన తండ్రికి పెరాల్సిస్ స్ట్రోక్ రావటంతో తనకు భవిష్యత్ లో రాకుండా మందులు ఇవ్వాలని డాక్టర్ ను కోరారు. దీనికి డాక్టర్ మందులు కాకుండా..ఆరు పిల్స్ రాస్తున్నాను...అవి ఫాలో అవ్వండంటూ సూచించారు.

అందులో మందులు కాకుండా..ఏ విధంగా లైఫ్ స్టైల్ మార్చుకోవాలో సూచించారు. 1. రోజూ 7 నుండి 8 గంటల సేపు నిద్రపోవాలి. 2. వాకింగ్, రన్నింగ్ వంటి వ్యాయామాలు రోజూ 30 నుండి 40నిమిషాలు చేయాలి.3. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. సాఫ్ట్ డ్రింక్స్, బేకరీ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ వదిలెయ్యాలి. పండ్లు, కూరగాయలు, పాలు, గుడ్లు, చేపలు, డ్రై ఫ్రూట్స్, నట్స్ మొదలైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. 4. రోజువారి పనిగంటలను 13-14 నుండి 8-9 గంటలకు తగ్గించుకోవాలి. 5. ధూమపానం, మధ్యపానానికి దూరంగా ఉండాలి. 6. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఈ ఆరు పాటిస్తే ప్రాణాంతక అనారోగ్య సమస్యలు దరిచేరదని డాక్టర్ పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ప్రిస్క్రిప్షన్ వైరల్ అవుతోంది.
35-yr old consulted me today, as he wanted me to prescribe aspirin pill to prevent stroke.
— Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) June 10, 2023
His father aged 60 had recently suffered from stroke (paralysis), and he was concerned about his higher risk of getting stroke in future.
Instead of one pill (aspirin), I prescribed "6… pic.twitter.com/3NzMu9TLBS
యువతలో ఎక్కువ మంది ఉద్యోగాల్లో పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అదే విధంగా విధుల నిర్వహణలో ఒత్తిడికి లోనవుతున్నారు. శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది.. ఇలాంటి సమస్యల కారణంగానే ఎక్కమంది స్ట్రోక్స్ బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఉద్యోగం సమయపాలనకు అనుగుణంగా చేసుకోవటం..ఆహారంలో మార్పులు...నిత్యం వ్యాయామం ద్వారా ..మానసిక ప్రశాంత వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చనేది వైద్యులు చేస్తున్న సూచన. ఇప్పుడు మందుల స్థానంలో ఈ వైద్య ప్రముఖుడు రాసిన ప్రిస్క్రిప్షన్ జాతీయ స్థాయిలో వైరల్ అవుతోంది. టీవీల్లో చర్చలకు కారణమైంి.












Click it and Unblock the Notifications