విశాఖలో ఐఐటి విద్యార్థి అనుమానాస్పద మృతి

జనవరి 17వ తేదీ ఉదయం గది లోపలికి వెళ్లిన శివతేజ, 18వ తేదీ శనివారం ఉదయం వరకూ బయటికి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది ఆ గది తలుపులు తట్టారు. ఎంతకూ తలుపులు తెరవకపోవడంతో.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సిఐ ఇలియాబాబు, ఎస్ఐ సోమరాజు ఆ గది తలుపులను పగలగొట్టి లోనికి వెళ్లారు.
గదిలోని బాత్ రూంలో శివతేజ మృతి చెంది ఉండటాన్ని పోలీసులు గమనించారు. కాగా శివతేజ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాలిథిన్ కవర్ ముఖానికి చుట్టుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపించాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కెజిహెచ్‌కు తరలించినట్లు చెప్పారు.
హైదరాబాద్ నగరంలో ఉన్న అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. కాగా రెండు రోజులుగా శివతేజ ఫోన్ కలవకపోవడంతో అనుమానం వచ్చిన అతడి తల్లిదండ్రులు ముంబైకి వెళ్లారు. పోలీసుల సమాచారం వారు తిరిగి విశాఖకు బయల్దేరారు. కాగా శివతేజ ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications