పులితో ఫోటో దిగాడు: ఆడుకొని, ఫేస్‌బుక్‌లో ఫోటో పెట్టాడు
హైదరాబాద్: ఓ యువకుడు పులితో ఆడుకునేందుకు ఒకరికి లంచం ఇచ్చి, ఆ పులిని చిత్రహింసలు పెట్టిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. సదరు యువకుడు పులితో ఆడుకున్న ఫోటోను సామాజిక అనుసంధాన వేదికలో పెట్టాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అతనిని అరెస్టు చేశారు.
పాతబస్తీకి చెందిన వ్యక్తి ఆరీఫ్ పులితో ఆడుకోవాలనుకున్నాడు. దీంతో తన స్నేహితులతో కలిసి జూకు వెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తికి లంచం ఇచ్చాడు. దీంతో పులితో ఆడుకునేందుకు అతనికి అనుమతి ఇచ్చాడు. అతను దొంగచాటుగా ఈ పని చేశాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

ఆరిఫ్ మాంసంను ఎరగా వేసి బోను సమీపానికి పులిని రప్పించాడు. కాలు పట్టుకొని లాగడం, తోక పట్టుకోని లాగడం చేస్తూ పులిని వేధించాడు. దానిని చిత్రహింసలు పెట్టాడు. వాటిని అతని స్నేహితులు ఫోటోలు తీశారు. అవే ఫేస్‌బుక్‌లో పెట్టారు.
దీంతో, పోలీసులు అతనిని అరెస్టు చేశారు. అతనిని మంగళవారం మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. జూలో పులిని యువకుడు వేధించాడని పోలీసులు చెప్పారు. జంతువులను వేధించడం చట్టరీత్యా నేరమన్నారు. ఈ కారణంగా అతనిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. అతనికి ఓ వ్యక్తి సహకరించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications