సెక్స్ రాకెట్ గుట్టు రట్టు: మహిళ సహా విటుడి అరెస్టు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం సుబ్రహ్మణ్యనగర్‌లో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని తెలుసుకున్న హయత్‌నగర్ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకురాలు, ఓ సెక్స్‌వర్కర్, విటుడిని అదుపులోకి తీసుకున్నారు. దేశబట్టెన వరలక్ష్మి సుబ్రహ్మణ్యనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. వివిధ ప్రాంతాల నుంచి మహిళలను రప్పించి వ్యభిచారం చేయిస్తోంది.
విశ్వసనీయ సమాచారంతో హయత్‌నగర్ సీఐ వెంకటేశ్వర్లు సోమవారం ఆ ఇంటిపై దాడి చేశారు. నిర్వాహకురాలు విజయలక్ష్మి, సెక్స్‌వర్కర్‌తో పాటు రాగన్నగూడకు చెందిన విటుడు జి.రవిచంద్రకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. సెక్స్‌వర్కర్‌ను రెస్క్యూ హోంకు, విటుడిని, నిర్వాహకురాలిని జైలుకు తరలించారు.

కాగా, పోలీసులు జవహర్ నగర్ సాకేత్ ఫేజ్ 2లోని ఓ బ్రోతల్‌పై దాడి చేసి ఓ మహిళకు విముక్కి కలిగించారు. 26 ఏళ్ల మహిళా నిర్వాహకురాలు లక్ష్మి మైథిలిని, విటుడు నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మి గుంటూరు జిల్లా సత్తెనపల్లికి నివాసి.
ఆ ఇంటిని ఆమె ఏడాది క్రితం అద్దెకు తీసుకుని బ్రోతల్ నడిపిస్తోంది. ఫిల్మ్ ప్రొడక్షన్ యూనిట్లో పనిచేస్తున్నానని ఆమె చెప్పుకుంటూ అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తూ వస్తోంది. 21 ఏళ్ల సెక్స్ వర్కర్‌కు విముక్తి కలిగించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications