పాతబస్తీలో 60 ఏళ్ల ఒమన్ వ్యక్తితో కాంట్రాక్ట్ మ్యారేజ్ భగ్నం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీలో మరో కాంట్రాక్ట్ మ్యారేజ్ వెలుగు చూసింది. ఒమన్‌కు చెందిన ఓ అరబ్ షేక్ పాతబస్తీకి చెందిన యువతిని పెళ్లి చేసుకొని తన దేశానికి తీసుకు పోయే ప్రయత్నం చేశారు.
సమాచారం అందడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అరబ్ షేక్‌ను, మీడియేటర్లను అరెస్టు చేశారు. సదరు అరబ్ షేక్ వయస్సు అరవైకి పైగా ఉంటుందని సమాచారం. బాలికను కాంట్రాక్ట్ పెళ్లి చేసుకొని ఒమన్ తీసుకొని వెళ్దామనుకున్నారు. సౌత్ జోన్ పోలీసులు ఆ బాలికను షేక్ కబందాల హస్తాల నుండి కాపాడారు.

బైక్ పై దూసుకెళ్లిన లారీ, వ్యక్తి మృతి
మెదక్ జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో శుక్రవారం బైక్ పైకి లారీ దూసుకెళ్లడంతో వ్యక్తి మృతి చెందాడు. నారాయణఖేడ్ బైపాస్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. రాములు అనే వ్యక్తి బైక్ పై బైపాస్ రోడ్డులో ప్రయాణిస్తుండగా, ఎదురుగా వస్తున్న లారీ అతనిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాములు అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు సంఘటనాస్థలం వద్దకు చేరుకుని కేసు నమోదు చేశారు.
యువతిపై ఇద్దరి అత్యాచారయత్నం
తూర్పుగోదావరి జిల్లాలో యువతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి యత్నించారు. రౌతులపూడి మండలంలో ఈ సంఘటన జరిగింది. ఓ యువతి ఇంటికి వెళ్లేందుకు ఆటోను ఆశ్రయించింది.
ఆటోలో వెళుతుండగా నిర్మాణుష్య ప్రాంతంలో డ్రైవర్ ఆటోను ఆపాడు. అంతలో ఆటోలో ఉన్న మరో ప్రయాణికుడితో కలిసి డ్రైవర్ కూడా ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. వారి బారి నుంచి బయటపడిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications