శ్రీదేవి డ్రామా కంపెనీలా... జగన్ వ్యాఖ్యలకు హైపర్ ఆది అదిరిపోయే పంచ్‌లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్న వేళ ఒకరిని మించి ఒకరు మాటల తూటాలను పేలుస్తున్నారు. సిద్ధం సభలలో ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి జనసేన తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్న హైపర్ ఆది తన వ్యాఖ్యలతో షాక్ ఇస్తున్నారు. మాటకు మాట సమాధానం చెబుతున్నారు.

ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలన్న జగన్ వ్యాఖ్యలకు కౌంటర్
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా ఒక పాఠం చదువుతున్నారని వ్యాఖ్యలు చేసిన హైపర్ ఆది అదిరిపోయే పంచ్ లు వేశారు. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి, గ్లాసు సింక్లో ఉండాలి అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల పైన మాట్లాడిన హైపర్ ఆది అవును ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి కానీ, ఫ్యాన్ నాలుగు లోనో, ఐదులోనో ఉండాలన్నారు.

Hyper Aadi stunning punches to YS Jagan comments

వాళ్ళింట్లోనే మంచి జరగలేదు .. మీకేం చేస్తారు?
గత ఎన్నికల్లోనే అనవసరంగా 151ఇచ్చి మీరంతా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల మీకు కరెంటుబిల్లు విపరీతంగా వస్తుంది. కాబట్టి ఈసారి రెగ్యులేటర్ నాలుగు, ఐదులో మాత్రమే ఉండేలా చూడండని పంచ్ వేశారు. అంతేకాదు మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటేయండి అని జగన్ అడుగుతున్నారని, వాళ్ళ ఇంట్లోనే ఇద్దరు చెల్లెళ్లకు అన్యాయం జరిగిందని, వాళ్ళ ఇంట్లోనే మంచి చేయలేనివాళ్ళు మీ ఇంట్లో ఏం చేస్తారంటూ హైపర్ ఆది జనాలను ప్రశ్నిస్తున్నారు.

అంతా గుంపుగా వస్తుంది అందుకే
సింహం సింగిల్ గా వస్తుంది.. జగన్ ను ఎదుర్కోవడానికి అందరూ గుంపుగా వస్తున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్న హైపర్ ఆది, ఇంట్లో దొంగ పడితే, దొంగను తరమడానికి నలుగురు కలిసి వెళ్తారని, ఇక రాష్ట్రంలో గజ దొంగలు పడితే వారందరిని తరమడానికి అందరూ కలవాల్సిన అవసరం ఉంది కాబట్టే, చెడును తరిమికొట్టడానికి మంచివాళ్లంతా కలవాల్సిన అవసరం ఉంది కాబట్టి కలిసారని వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ నాయకుల డ్రామాలు నమ్మొద్దు
శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఇన్ని డ్రామాలు చూడలేదని వైసిపి నాయకులు సానుభూతి కోసం రకరకాల వేషాలు వేస్తున్నారని హైపర్ ఆది మండిపడ్డారు. వంగా గీత వడదెబ్బ తగిలి పడిపోయారని చెబుతున్నారని, రాష్ట్రవ్యాప్తంగా 151 మంది ఈ వారం రోజుల్లో ఇలాగే వడదెబ్బ తగిలి పడిపోతారని, ఈ డ్రామాలను జనాలు నమ్మకూడదని హైపర్ ఆది వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+