పవన్ కల్యాణ్‌ను హీరోగా చూడొద్దు, తలో మాట అంటారు: హైపర్ ఆది

హైదరాబాద్: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానలకు హైపర్ ఆది ఓ సలహా ఇచ్చారు. మహేష్ కత్తితో వివాదం ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఆయన శనివార ఆ సలహా ఇచ్చినట్లు అర్థమవుతోంది.

ట్విట్టర్ ద్వారా ఆయన తన సందేశాన్ని ఇచ్చారు. పవన్ కల్యాణ్‌న హీరోగా చూడవద్దని, మన నాయకుడని మాత్రమే అనుకోవాలని ఆయన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు సూచించారు. మహేష్ కత్తిపై వివాదంలో ఆయన తలదూర్చిన విషయం తెలిసిందే.

 మహేష్ కత్తి విషయంలోనే...

మహేష్ కత్తి విషయంలోనే...

మహేష్ కత్తి విషయంలో పాలు పంచుకోవద్దని హైపర్ అది పరోక్షంగా పవన్ కల్యాణ్ అభిమానులకు సూచించారు. మీ అడుగులు ఇక మంచి కోసం వేయండని ఆయన సలహా ఇచ్చారు.

నవ్వుకోవాలి అంతే..

నవ్వుకోవాలి అంతే..

రాజకీయంలో వంద మంది వంద రకాలుగా మాట్లాడుతారని, అందరినీ చూడాలని హైపర్ ఆది సూచించారు. నవ్వుకోవాలి... వదిలేయాలని అన్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ ప్రజల మనిషి అని, హీరో అనుకోవడం మానేయాలని, మన నాయకుడు మాత్రమే అనుకోవాలని ఆయన సూచించారు.

యాదృచ్ఛికంగానే కలిశాం...

యాదృచ్ఛికంగానే కలిశాం...

తాను, మహేష్ కత్తి యాదృచ్ఛికంగానే కలిశామని, అదే దురదృష్టకరమని, దాన్ని మహేష్ కత్తి వివాదం చేశారని, ఉన్నతమైన విలువలు ఉన్న పవన్ కల్యాణ్‌ను కత్తి మహేష్ విమర్శించడం తట్టుకోలేక బహిరంగంగా స్పందించానని, అయితే తమ మధ్య వివాదం లేదని హైపర్ ఆది ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

 నాకు పవన్ కల్యాణ్ ఆరాధ్యుడు..

నాకు పవన్ కల్యాణ్ ఆరాధ్యుడు..

తనకు స్ఫూర్తి మెగాస్టార్ చిరంజీవి అయితే ఆరాధ్యుడు పవన్ కల్యాణ్ అని హైపర్ ఆది ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో అన్నారు. పవన్ కల్యాణ్ సింపుల్ిసటీ, నిష్కలంక మనస్తత్వం, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి తన డబ్బును తృణప్రాయంగా ఖర్చు ెట్టడం వంటి వాటి వల్ల తనకు అభిమానం పెరిగిందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+