‘నాన్నా.. ఆత్మహత్య చేసుకుంటున్నా’: తండ్రికి మహిళ ప్రొఫెసర్ ఫోన్
హైదరాబాద్: తన తండ్రికి ఫోన్ చేసిన ఓ మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్.. ‘నాన్నా.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను' అని చెప్పింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆమె కుటుంబసభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సదరు మహిళ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తోంది. అయితే ఎప్పటిలాగే బుధవారం ఉదయం విశ్వవిద్యాలయానికి వచ్చిన సదరు మహిళ ప్రొఫెసర్.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తన తండ్రికి ఫోన్ చేసి చెప్పింది.

అంతేకాకుండా, ఆ డైరీ యూనివర్సిటీ లైబ్రరీలో ఉందని చెప్పి ఫోన్ పెట్టేసింది. దీంతో ఆందోళనకు గురైన వారు వెంటనే యూనివర్సిటీకి చేరుకున్నారు. ఆమె అక్కడ లేకపోవడంతో ఆమె కోసం గాలించారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆచూకీ కోసం ప్రయత్నించారు. మెదక్ జిల్లా జహీరాబాద్ పరిసర ప్రాంతంలో ఆమె సెల్ సిగ్నల్స్‌ను పోలీసులు ట్రేస్ చేశారు. వెంటనే నగర పోలీసులు అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. సదరు మహిళా ప్రొఫెసర్ ఆచూకీ కోసం ఇంకా గాలింపు కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications