శ్రీజకు బొమ్మలు కొని తెచ్చిన పవన్, కారుకు ప్రమాదం

రాజమండ్రి/ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీజను జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం కలిశారు. ఆమెను పరామర్శించారు. రాజమండ్రిలో ఆమె కోసం కొన్న బొమ్మలను పవన్ కళ్యాణ్ చిన్నారికి అందించారు. రెండు లక్షల చెక్కు కూడా అందించారు. దీంతో ఆమె ఆనందం వ్యక్తం చేసింది.

శ్రీజ చూసేందుకు వెళ్తుండగా.. పవన్ కారుకు ప్రమాదం

ఖమ్మం జిల్లాలో ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీజను కలిసేందుకు రాజమండ్రి నుండి కారులో వెళ్తున్న పవన్ కారు శుక్రవారం ఉదయం స్వల్ప ప్రమాదానికి గురయింది. కొణిజర్ల వద్ద పవన్‌కు ప్రమాదం తప్పింది. కారు ప్రమాదానికి గురి కావడంతో మరో కారులో ఖమ్మం బయలుదేరారు. ప్రమాదంలో పవన్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.

శ్రీజను కలిసేందుకు వెళ్తున్నా

అంతకుముందు, అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీజను కలిసేందుకు తాను ఖమ్మం వెళ్తున్నట్లు పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం మీడియాతో చెప్పారు. మేక్ ఏ విష్ ఫౌండేషన్ చేసిన విజ్ఞప్తికి పవన్ స్పందించిన విషయం తెలిసిందే. శ్రీజ ప్రస్తుతం ఖమ్మంలోని ఓ ప్రయివటేు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఆమె హైదరాబాద్ రాలేని పరిస్థితి ఉండటంతో పవన్ రాజమండ్రి నుండి నేరుగా ఖమ్మం బయలుదేరారు. హుధుద్ తుఫాను పైన మాట్లాడుతూ.. విశాఖలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఉత్తరాంధ్రలో క్రమంగా పరిస్థితులు కుదుట పడుతున్నాయని తెలిపారు.

I am going Khammam: Pawan Kalyan

హుధుద్ తుఫాను బాధితులకు అందరూ అండగా నిలవాలను ఆయన విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపత్తు నివారణ వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. తుఫాను పునరావాస సహాయక చర్యల్లో సినీ పరిశ్రమ పాలు పంచుకోవడం అభినందనీయమన్నారు. మున్ముందు ఉత్తరాంధ్రలో పునరావాస కార్యక్రమాల్లో జనసేన పాలు పంచుకుంటుందన్నారు.

కాగా, పవన్ కళ్యాణ్ బుధవారం, గురువారం విశాఖలో పర్యటించిన విషయం తెలిసిందే. హుధుద్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఆయన పర్యటించారు. బాధితులను పరామర్శించారు. అనంతరం గురువారం ఉదయం చంద్రబాబు నాయుడును కలిసి యాభై లక్షల రూపాయల చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పని తీరును కొనియాడారు. ప్రభుత్వాల ముందు చర్య వల్ల నష్టం తగ్గిందన్నారు. చంద్రబాబు, మోడీల పని బాగుందని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో మేక్ ఏ విష్ ఫౌండేషన్ శ్రీజ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకు రావడంతో ఆయన స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+