సిఎం రేసులో లేను: షబ్బీర్ అలీ, బిల్లు పెట్టాలి: ఎర్రబెల్లి

తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ కాంగ్రెసు పార్టీదే అన్నారు. ఇప్పటికీ రాష్ట్ర ఏర్పాటుపై అనుమానాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పడం సరికాదన్నారు. తెలంగాణ ఇచ్చినందువల్ల వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు జెండా ఎగరడం ఖాయమన్నారు.
హైదరాబాదు రాజధానిగా పది జిల్లాల తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ విభజన విషయంలో మాట మార్చాయని ఆరోపించారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దన్నారు. తెలంగాణ వచ్చినా సీమాంధ్రుల రక్షణకు ఢోకా ఉండదన్నారు.
బిల్లు పెట్టాలి: ఎర్రబెల్లి
పార్లమెంటులో తెలంగాణ బిల్లును త్వరలో పెట్టాలని టిడిపి సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. ఏ ఒక్క పార్టీ వల్లనో తెలంగాణ రాలేదని, విద్యార్థుల బలిదానం వల్ల సాధ్యమయిందన్నారు. తెలంగాణ కోసం మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేసి ప్రభుత్వం ఆదుకోవాలని మోత్కుపల్లి నర్సింహులు సూచించారు. ఇరు ప్రాంతాలకు కేంద్రం న్యాయం చేయాలని వారు కోరారు.












Click it and Unblock the Notifications