వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీ వల్లే మోడీకి నోటీసులు, నీ పేపరు చూస్తే భగ్గు: జగన్‌పై బాబు ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

Chandrababu Naidu Warning to YS Jagan Over Investments

అమరావతి: ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుమ్మెత్తిపోశారు. సిఐఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో పారిశ్రామికవేత్తలతో ప్రభుత్వం చేసుకున్న అవగాహనా ఒప్పందాలన్నీ మోసంగా పరిగణస్తావా అంటూ ఆయన జగన్‌ను అడిగారు.

ఉదయం లేస్తూనే నీ పేపరు (సాక్షిదినపత్రిక) చూస్తే హృదయం భగ్గుమంటుందని ఆయన మండిపడ్డారు. నీలా ఇంట్లో కూర్చుని దొంగ లెక్కలు రాయలేదని, 16 నెలల పాట జైల్లో కూర్చోలేదని విరుచుకుపడ్డారు.

ఆయనకు ఏం అనుభవం ఉంది...

ఆయనకు ఏం అనుభవం ఉంది...

జగన్‌కు రాజకీయ, పాలనానుభవం ఏముందని చంద్రబాబు అడిగారు. చంద్రబాబు మంగళవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 2016,, 2017 సదస్సుల్లో కన్నా బాగా వడపోసి వాస్తవాలకు దగ్గరగా ఉన్న ఒప్పందాలే చేసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

పారదర్శకంగా ఆన్‌లైన్‌లో

పారదర్శకంగా ఆన్‌లైన్‌లో

ఒప్పందాలకు సంబంధించిన సమాచారమంతా పారదర్శకంగా ఆన్‌లైన్‌లో పారదర్శకంగా ఉంచుతున్నామని చంద్రబాబు చెప్పారు. పెట్టుబడులతో పాటు ఉద్యోగాలు కూడా ఎవరెవరికి వచ్చాయో వివరిస్తామని చెప్పారు. ప్రభుత్వం పెట్టుబడి ఒప్పందాలు పారదర్శకంగా చేసుకుంంటుంటే మోసం చేస్తుందంటూ నీ పత్రికలో రాయిస్తావా అని ఆయన జగన్‌పై మండిపడ్డారు.

ఇలా చేస్తూ నీవు

ఇలా చేస్తూ నీవు

ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెబుతూ రాష్ట్రంలో ఏ విధమైన అభివృద్ది జరగలేదని ప్రజల్లో అపోహలు కల్పంచేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు అన్నారు.

40 ఏళ్ల రాజకీయ జీవితంలో...

40 ఏళ్ల రాజకీయ జీవితంలో...

తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో రాష్ట్ విభజన జరిగిన తర్వాత మూడున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చాయని చంద్రబాబు చెప్పారు. హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన చేయడం చాలా బాధ కలిగించిందని అన్నారు.

వైఎస్‌లా హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదు...

వైఎస్‌లా హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదు...

వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరిగా తాను హత్యారాజకీయాలను ప్రోత్సహించలేదని చంద్రబాబు అన్నారు. తండ్రిని అడ్డు పెట్టుకుని జగన్ అక్రమ సంపాదనకు దిగడం వల్ల ఐదుగురు సివిల్ సర్వీస్ అధికారులు సిబిఐ దర్యాప్తు ఎదుర్కున్నారని విమర్శించారు. జైలు జీవితం అనుభవించారని ఆవేదన వ్యక్తం చేశారు.

మారిషస్ సంస్థ ఏకంగా...

మారిషస్ సంస్థ ఏకంగా...

వైఎస్ జగన్ వల్లనే మారిషస్ సంస్థ ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకి నోటీసులు జారీ చేసే పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు అన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ తదితర వ్యవహారాల కారణంగా రాష్ట్ర ప్రతిష్ట దెబ్బ తిన్నదని ఆయన అన్నారు.

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu made serious coments against the YSR Congress party presidnt YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X