ఏ పార్టీలో చేరను, రాజకీయాల్లోకి రాను: లక్ష్మీనారాయణ

తాను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ప్రచారం జరుగుతోందని, అదంతా మీడియా కల్పితాలే అన్నారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు.
కాగా, ఓబుళాపురం గనులు, జగన్ అక్రమాస్తుల వంటి పలు అనేక సంచలనాత్మక కేసులను దర్యాప్తు చేసిన లక్ష్మీనారాయణకు భారతీయ జనతా పార్టీ నుండి పిలుపు వచ్చినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయనను ఆమ్ ఆద్మీ పార్టీ ఆహ్వానించగా, ప్రస్తుతం బిజెపి నాయకులు ఆయనకు గాలం వేసినట్లు ప్రచారం జరిగింది.
మహారాష్ట్ర కేడర్‌కు చెందిన లక్ష్మీనారాయణ డిప్యుటేషన్‌లో భాగంగా సిబిఐ జెడిగా ఆంధ్రప్రదేశ్‌లో పని చేశారు. డిప్యుటేషన్ ముగిసిన తర్వాత సుమారు తొమ్మిది నెలలపాటు ఆయనకు మహారాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. ఇటీవలే ఆయనను థానే జాయింట్ కమిషనర్‌గా నియమించింది.
లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్‌లో వివిద కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆయనను సంప్రదించి, తమ పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. అయితే, ఆయన సన్నిహితులు మాత్రం బిజెపిలో చేరితే బాగుంటుందని సలహా ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.












Click it and Unblock the Notifications