జగన్ పార్టీలోకి వెళ్లడం లేదు: రాజకీయాలకంటే రాయపాటే ముఖ్యమన్న డొక్కా
గుంటూరు: తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానాలు రావడంతో అంగీకరించానని.. అయితే ప్రస్తుతం నిర్ణయం మార్చుకున్నానని శనివారం మీడియాకు తెలిపారు.
తాను రాజకీయాల్లో పదకొండేళ్ల బాలుడినేని, ఇంకా ఎంతో అధ్యయనం చేయాల్సి ఉందని, ప్రస్తుతం నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నానని చెప్పారు. ప్రస్తుత రాజకీయాలకు తాను పనికి రాననిపిస్తోందని వేదాంత ధోరణిలో మాట్లాడారు. తన రాజకీయ భవిష్యత్తు అంతా అయోమయంగా ఉందని, తాను ఇక రాజకీయాల్లో ఉండకపోవచ్చేమోనని అన్నారు.

తనకు రాజకీయాలకంటే ఎంపీ రాయపాటి సాంబశివరావే ముఖ్యమని చెప్పారు. ఈ సమావేశంలో రాయపాటి మాట్లాడుతూ.. మాణిక్యవరప్రసాద్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న వార్తలు తనను విస్మయానికి గురి చేశాయని అన్నారు.
వెంటనే ఆయనతో మాట్లాడానని.. తామంతా ఒకేచోట ఉంటామని స్పష్టం చేశారు. వరప్రసాద్‌ని టిడిపిలోకి తీసుకురావాల్సిందిగా సీఎం చంద్రబాబు తనను అడిగారని, ఆయన సేవలు పార్టీకి అవసరంగా సీఎం భావిస్తున్నారని రాయపాటి తెలిపారు.












Click it and Unblock the Notifications