రాహులేనా.. సోనియాతోను సై: నాగం, కిరణ్‌పై సారయ్య

కాంగ్రెసు పార్టీలో తనపై పోటీ చేసే సత్తాలేకే రాహుల్ గాంధీ వద్దకు వెళ్లారని నాగం ఎద్దేవా చేశారు. బిజెపి రెండు ప్రాంతాల నుండి మంత్రుల బృందానికి(జివోఎం)కు నివేదిక ఇస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు ప్రత్యేక ప్యాకేజీని కూడా ప్రకటించాలని నాగం డిమాండ్ చేశారు.
కాగా, మంత్రి డికె అరుణ ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌ను కలిసి రాహుల్‌ను పాలమూరు నుండి పోటీ చేయించే విషయమై అడిగిన విషయం తెలిసిందే.
ఉద్యమంలో నుంచి టిఎంయు పుట్టుకు వచ్చింది: హరీష్ రావు
హైదరాబాదు నగర పరిధిలో ఉన్న ఆర్టీసి డిపోలను జిహెచ్ఎంసిలో కలిపితే ఊరుకునేది లేదని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు వేరుగా అన్నారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఆయన వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. టిఎంయు తెలంగాణ ఉద్యమం నుండి పుట్టుకు వచ్చిందన్నారు. టిఎంయు తెలంగాణ ఉద్యమం నుండి పుట్టుకు వచ్చిందన్నారు.
సునామీ లాంటిది: సారయ్య
తెలంగాణ ఉద్యమాన్ని తుఫానుతో పోల్చడం దురదృష్టకరమని మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. తెలంగాణ అంశం సునామీలాంటిదని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే శక్తి ఎవరికీ లేదన్నారు. టిని అడ్డుకుంటామని చెప్పడం సరికాదన్నారు. తాము జివోఎంకు నివేదిక ఇస్తామన్నారు. రాష్ట్రం ఏర్పాటు విషయంలో కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గదన్నారు. 2014లోపే తెలంగాణ ఏర్పడుతుందని, ఒకవేళ వెనక్కి వెళ్తే తామెవరం కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేయమన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రెండు రోజుల క్రితం విభజనను తుఫానుతో పోల్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications