బాలకృష్ణలా నేను రివాల్వర్ వాడను, ఆ గన్‌కేం సంబంధం: బాబుపై ముద్రగడ
రాజమహేంద్రవరం: తాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వియ్యంకుడు, బావమరిది నందమూరి బాలకృష్ణలా రివాల్వర్ ఉపయోగించనని కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం శుక్రవారం నాడు చెప్పారు. బాలకృష్ణ తన భార్య రివాల్వర్‌ను కూడా ఉపయోగించారని విమర్శించారు.
తన పైన, తన అనుచరుల పైన పోలీసుల వేధింపులు చాలా ఎక్కువయ్యాయని చెప్పారు. తాము రాజమహేంద్రవరంలో సమావేశం పెట్టుకుంటే అడ్డంకులు సృష్టించారని ధ్వజమెత్తారు. సమావేశానికి మండపం ఇచ్చినందుకు తన వియ్యంకుడికి నోటీసులు ఇచ్చారన్నారు.

తన వియ్యంకుడిని నిన్న రివాల్వర్ అప్పగించమని పోలీసులు కోరారని చెప్పారు. అయితే ఆయన రివాల్వర్‌కు, తనకు సంబంధం ఏమిటో చెప్పాలన్నారు. రివాల్వర్ వాడింది చంద్రబాబు వియ్యంకుడు బాలయ్య అని, తాను అతనిలా వాడనని చెప్పారు. తాను ఆసుపత్రి అనే జైలులో 14 రోజులు గడిపానని, రాష్ట్రంలో మానవ హక్కులు లేవన్నారు.












Click it and Unblock the Notifications