Pawan Kalyan: నేను యూటర్న్ తీసుకోలేదు!

త్రిభాష విధానంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఒక భాషను బలవంతంగా రుద్దడం లేదా ఒక భాషను వ్యతిరేకించడం సరికాదని అన్నారు. భారతదేశ జాతీయ, సాంస్కృతిక ఏకీకరణ లక్ష్యాన్ని సాధించడంలో ఈ రెండు అంశాలు దోహదపడవంటూ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

తాను ఎప్పుడూ హిందీని ఒక భాషగా వ్యతిరేకించలేదని, దాన్ని తప్పనిసరి చేయడాన్ని మాత్రమే వ్యతిరేకించినట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎన్ఈపీ 2020 (NEP 2020) స్వయంగా హిందీని అమలు చేయలేదన్నారు. హిందీ భాష అమలు విషయంలో తప్పుడు కథనాలను వ్యాప్తి చేయడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం తప్ప మరొకటి కాదన్నారు.

I have never been against Hindi Pawan Kalyan

ఎన్ఈపీ 2020 ప్రకారం విద్యార్థులు విదేశీ భాషతోపాటు ఏవైనా రెండు భారతీయ భాషలు(మాతృ భాషతోపాటుగా) నేర్చుకునే వెసులుబాటు ఉంటుంది. హిందీ వద్దనుకుంటే వారి మాతృభాషతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ ఇలా ఏదైనా ఇతర భారతీయ భాషను ఎంచుకోవచ్చని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

విద్యార్థులకు ఎంపిక చేసుకునే సాధికారతను కల్పించడం ద్వారా జాతీయ ఐక్యతను ప్రోత్సహించడం, భారతదేశ గొప్ప భాషా వైవిధ్యాన్ని కాపాడం కోసమే బహుభాషా విధానాన్ని రూపొందించారన్నారు. దీన్ని రాజకీయ అజెండా కోసం తప్పుగా అర్థం చేసుకోకూడదని పవన్ కళ్యాణ్ హితవు పలికారు.

Take a Poll

బహు భాషా విధానంపై పవన్ కళ్యాణ్ తన వైఖరిని మార్చుకున్నారని చెప్పడం పూర్తిగా అవగాహనా రాహిత్యమే అవుతుందని డీఎంకే నేతలకు కౌంటర్ ఇచ్చారు. ప్రతి భారతీయుడికి భాషా స్వేచ్ఛ, విద్యను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉండాలన్న విషయంలో జనసేన పార్టీ కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

కాగా, శుక్రవారం జరిగిన జనసేన ఆవిర్బావ సభలో తమిళనాడులో హిందీని వ్యతిరేకిస్తూ అధికార డీఎంకేతోపాటు పలు పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డీఎంకే నేతలు స్పందిస్తూ.. గతంలో పవన్ కూడా హిందీని వ్యతికించారని ఇప్పుడు మాత్రం యూటర్న్ తీసుకున్నారంటూ డీఎంకే నేతలు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ కూడా వారి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+