ఆ ఒక్క కారణంతోనే బీజేపిలో చేరాను..! కమలం పార్టీలో చేరికపై వివరణ ఇచ్చిన మాజీ సీఎం నాదెండ్ల..!!

Recommended Video

    బీజేపిలో చేరికపై క్లారిటీఇచ్చిన నాదెండ్ల భాస్కరరావు| Former Andhra pradesh CM Bhaskara Rao Joins BJP

    అమరావతి/హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోవడంపై రాజకీయ నేతలు పలు రకాలుగా విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలకు స్పందించిన ఆయన తాను ఎందుకు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు..?

    ఈ వయసులో కాషాయ కండువా ఎందుకు కప్పుకోవాల్సి వచ్చిందనే విషయాలపై క్లారిటీ ఇచ్చారు. ధర్మరాజు 80 ఏళ్ల వయసులో యుద్ధం చేశారు. నేను రాజకీయ పోరాటం ఎందుకు చేయకూడదని నాదెండ్ల ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలాగా ఉండవని, కాలంతో పాటు మారుతుంటాయని చెప్పుకొచ్చారు. తాను సమకాలీన రాజకీయాలతో పోటీ పడదేందుకు సిద్దంగా ఉన్నానని నాదెండ్ల భాస్కర్ రావు తెలిజేసారు.

    I joined the BJP for the same reason.!Former CM Nadendla clarifies his joining in bjp..!!

    "రెండు తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలియని వారంటూ లేరు. ప్రాంతీయ పార్టీల ప్రభావం తగ్గింది. వాటిలో బంధు ప్రీతి, కులాభిమానం పెరిగింది. అందుకే నేను జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరాను. ప్రధాని మోదీ దేశ, విదేశాల్లో మంచి పేరు సంపాదించారు. నేను వాజపేయి హయాంలోనే బీజేపీలో చేరాలనుకున్నాను. మోదీ, అమిత్ షా‌ల పిలుపు మేరకు నేను బీజేపీలో చేరాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను. దేశం మోదీ చేతుల్లో చాలా భద్రంగా ఉంది.

    బీజేపీ మొదటి నుంచి నిస్వార్ధంతో పనిచేస్తుంది. నాకు వయసు సహకరిస్తుందా..? అని కొందరు అడుగుతున్నారు. రాజకీయాలలో వయసుతో పనిలేదు. మనసు ఉత్సాహంగా ఉండాలి. ధర్మరాజు 80ఏళ్ల వయసులో యుద్ధం చేశారు. నేను ఇరు రాష్ట్రాలలో ఎక్కడైనా ప్రచారం చేయడానికి రెడీగా వున్నాను" అని నాదెండ్ల ఈ సందర్భంగా తేల్చిచెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+