కొడాలి నాని ఎవరో తెలియదు! తెలిసింది నేచురల్ స్టార్ నాని మాత్రమే: రాంగోపాల్ వర్మ సెటైర్లు

హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే ఏపీలో సినిమా థియేటర్లలో రేట్లు తగ్గించడంపై పలువురు సినీ ప్రముఖులు బహిరంగంగానే స్పందించారు. అయితే, వారికి ఏపీ ప్రభుత్వంలోని మంత్రులు, నేతలు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. తాజాగా, ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఏపీ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరుసగా ఏపీ సర్కారుకు ప్రశ్నలు సంధిస్తున్నారు.

కొడాలి నానికి రాంగోపాల్ వర్మ కౌంటర్

కొడాలి నానికి రాంగోపాల్ వర్మ కౌంటర్

తాజాగా, రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ మంత్రి కొడాలి నాని ఎవరో తనకు తెలియదని.. కేవలం సినిమా హీరో నేచురల్ స్టార్ నాని మాత్రమే తనకు తెలుసని రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. ఏపీలో సినిమా టికెట్ల ధరలపై రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని మండిపడిన క్రమంలో వర్మ ఈ మేరకు స్పందించడం గమనార్హం. పక్క రాష్ట్రంలో నివాసం ఉంటూ అక్కడ సినిమాలు తీసుకునేవారికి సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదని కొడాలి నాని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

కొడాలి నాని తెలీదు.. నేచురల్ స్టార్ నాని మాత్రమే తెలుసంటూ ఆర్జీవీ

కొడాలి నాని తెలీదు.. నేచురల్ స్టార్ నాని మాత్రమే తెలుసంటూ ఆర్జీవీ

ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల విషయంపై నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంబంధించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్‌కి సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు. నాకు తెలిసిన నాని సినిమా హీరో నేచురల్ స్టార్ నాని ఒక్కడే. వాళ్లు చెప్తున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు' అని రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.

వర్మ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కొడాలి నాని

వర్మ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కొడాలి నాని

ఏపీలో టికెట్ల ధరలపై గత రెండ్రోజులుగా రాంగోపాల్ వర్మ తీవ్రంగా స్పందిస్తున్నారు. టికెట్ ధరలు నియంత్రించడానికి ప్రభుత్వానికి ఏం అధికారం ఉంది? అని ఆర్జీవీ మంగళవారం ప్రశ్నించగా.. కొడాలి నాని స్పందిస్తూ.. రాష్ట్రంలో ప్రస్తుతం మా పార్టీ అధికారంలో ఉంది. ప్రజలే మాకు ఈ అధికారాన్ని అప్పగించారు. పక్క రాష్ట్రంలో కూర్చుని, అక్కడ సినిమాలు తీసుకుంటున్న వ్యక్తులకు సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదన్నారు.

రాస్ట్రంలో ఉన్న ప్రజలకే తాము జవాబుదారీగా ఉంటామని, రాస్ట్రంలో ఉన్న ప్రజల ఆర్థిక పరిస్థితుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం. సినిమా టికెట్ ధరల్లో ప్రభుత్వానికి సంబంధం లేదని వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. మరి, వాళ్లనే అమ్ముకోమని చెప్పండి చూద్దాం. అని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆర్జీవీ స్పందించారు.

‘నాని' తెలియదంటూ అప్పుడు మంత్రి అనిల్.. ఇప్పుడు వర్మ

‘నాని' తెలియదంటూ అప్పుడు మంత్రి అనిల్.. ఇప్పుడు వర్మ

కాగా, శ్యామ్ సింగరాయ్ సినిమా విడుదల సమయంలో టికెట్ ధరలపై హీరో నాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. సినిమా టికెట్ ధరలను తగ్గించడం వినియోగదారులను అవమానించడమేనని, సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తే థియేటర్ పక్కన ఉన్న కిరాణ కొట్లలోనే ఎక్కువ కలెక్షన్ ఉంటాయన్నారు.

నాని వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. కిరాణ కొట్లలోనే ఎక్కువ కలెక్షన్ ఉంటే.. సినిమాలు తీయకండి కిరాణా కొట్టే పెట్టుకోండని సూచించారు. ఇంకా, నాకు కొడాలి నాని ఒక్కరే తెలుసు.. ఈ నాని ఎవరో నాకు తెలియదు అని అన్నారు.

ఇప్పుడు రాంగోపాల్ వర్మ కూడా తనకు కొడాలి నాని తెలియదు.. హీరో నాని మాత్రమే తెలుసని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతో ఇద్దరు మంత్రులకు ఒకేసారి జవాబిచ్చారంటూ వర్మ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+