చాలా చెప్పారు: జయసుధ, మాటిచ్చి తప్పిన అక్కినేని!
హైదరాబాద్: అక్కినేని నాగేశ్వర రావు నుండి తాము ఎంతో నేర్చుకున్నామని, ఆయన ఈ స్థాయికి ఎదిగేందుకు ఎంత స్ట్రగుల్ చేశారో చెప్పేవారని, అవన్నీ తమకు స్ఫూర్తిదాయకమని సికింద్రాబాద్ శాసన సభ్యురాలు, ప్రముఖ నటి జయసుధ బుధవారం అన్నారు. అక్కినేని మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అన్నారు.
ఆయనతో పలు సినిమాల్లో నటించానని, ఆయనతో నటించడం ఓ పాఠమన్నారు. ఆయన నుండి ఎన్నో నేర్చుకోవచ్చునని చెప్పారు. తమకు ఎన్నో విషయాలు చెప్పే వారన్నారు. ఆయన చెప్పిన మాటలు తమకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. అతను సెట్స్‌లో ఉన్నప్పుడు వాతావరణం మొత్తం ఎనర్జిటిక్‌గా మారిపోతుందన్నారు. అతను డ్యాన్స్ తమకు ఆశ్చర్యం కలిగించేదన్నారు.

మరోవైపు అక్కినేని నాగేశ్వర రావు మాట తప్పారని ఆయన అభిమానులు, రాజకీయ, సినీ ప్రముఖులు ఆవేదనగా చెబుతున్నారు. తాను 96 ఏళ్లు జీవిస్తానని చెప్పి ముందే వెళ్లిపోయారని గుర్తు చేసుకుంటున్నారు.
తనకు తెలిసి తమ ఇంట్లో తమ అమ్మ తన కళ్ల ముందు 96 ఏళ్లు బతికిందని, తాను కూడా గ్యారెంటీగా 96 ఏళ్లు బతుకుతాననే నమ్మకం ఉందని, అభిమానుల ఆశీర్వాద బలం ఉంటే సెంచరీ కూడా కొడతానని అనుకుంటున్నానని గత ఏడాది అక్టోబర్ 19వ తేదీన అక్కినేని ప్రకటించారు. తనకు కేన్సర్ సోకిందని బహిరంగ ప్రకటన చేశారు. అక్కినేని బహిరంగంగా, మీడియాకు కనిపించడం అదే చివరిసారి.












Click it and Unblock the Notifications