పవన్ కళ్యాణ్ పై గెలుస్తానంటూ జలీల్ ఖాన్ సంచలన కామెంట్స్
సినీ నటుడు, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ పై తాను పోటీచేసి కనీసం పది ఓట్ల తేడాతోనైనా విజయం సాధిస్తానని టిడిపి ఎంఏల్ఏ జలీల్ ఖాన్ ధీమాను వ్యక్తం చేశారు.
అమరావతి:సినీ నటుడు, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ పై తాను పోటీచేసి కనీసం పది ఓట్ల తేడాతోనైనా విజయం సాధిస్తానని టిడిపి ఎంఏల్ఏ జలీల్ ఖాన్ ధీమాను వ్యక్తం చేశారు.
ఎన్నికలంటే తనకు భయం లేదని జలీల్ ఖాన్ చెప్పారు. తాను ఎన్నికల్లో ఎప్పుడు పోటీచేసినా విజయం సాధిస్తానని ఆయన చెప్పారు. సినీ నటుడు పవన్ కళ్యాణ్ పై పోటీ చేసి విజయం సాధిస్తాననే ధీమాను వ్యక్తం చేశారు.

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చే ఐడియాలు మరెవరికీ రావని అడవిలో కూడ అసెంబ్లీ కట్టారని బాబు ను కొనియాడారు.చంద్రబాబు ముందు మోడీ కూడ సరిపోరనంటూ ఆకాశానికి ఎత్తాడు.
బిజెపితో ఉండాల్సిన అవసరం లేదని, రాజకీయంగా అవసరాలు కూడ లేవన్నారు. తనకు మంత్రి పదవి వస్తోందో లేదో తనకు తెలియదన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రిగా కంటే ఎంఏల్ఏగా ఉండడమే మేలని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications