కొడాలి నానిపై పోటీ చేస్తానంటూ రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లో తాను ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని రేణుకా చౌదరి చెప్పారు. అంతేగాక, ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడ నుంచి కూడా పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేశారు.

ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఫ్రైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న రేణుకా చౌదరి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తాను తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పోటీ చేయబోతున్నట్లు ఆమె ప్రకటించారు. రెండు చోట్ల నుంచి, అది కూడా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.

ఖమ్మంతోపాటు గుడివాడ నుంచి పోటీ చేస్తానంటూ రేణుకా చౌదరి

ఖమ్మంతోపాటు గుడివాడ నుంచి పోటీ చేస్తానంటూ రేణుకా చౌదరి

వచ్చే ఎన్నికల్లో తాను ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని రేణుకా చౌదరి చెప్పారు. అంతేగాక, ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడ నుంచి కూడా పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేశారు. అయితే, గుడివాడ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య పోటీ నెలకొంటే మాటల తూటాలు పేలే అవకాశం లేకపోలేదు.

గుడివాడ నుంచి పోటీ చేయాలంటూ రేణుకా చౌదరిపై ఒత్తిడి!

గుడివాడ నుంచి పోటీ చేయాలంటూ రేణుకా చౌదరిపై ఒత్తిడి!

మొన్నటి వరకూ ఉమ్మడి రాష్ట్రమే కదా.. ఏపీలో పోటీ చేస్తే తప్పేంటి అని రేణుకా చౌదరి ప్రశ్నించారు. ఏపీలోనూ పోటీ చేయాలని తనపై ఒత్తిడి వస్తోందని అందుకే గుడివాడ స్థానం నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు ఆమె తెలిపారు. రెండు చోట్ల పోటీ చేయడంపై తాను సీరియస్ ఉన్నట్లు చెప్పారు.
ఇక ఖమ్మం ఎంపీ విషయంలో పార్లమెంటు ఎన్నికప్పుడు ఆలోచిస్తానని అన్నారు.

పొంగులేటిపై రేణుకా చౌదరి హాట్ కామెంట్స్

పొంగులేటిపై రేణుకా చౌదరి హాట్ కామెంట్స్

కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రే తోపాటు హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొంటానని.. ఖమ్మంకు రేవంత్ రెడ్డిని ఆహ్వానించి భారీ బహిరంగ ఏర్పాటు చేస్తామని రేణుకా చౌదరి తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఓట్ల కోసం గ్రామాల్లోకి ఎలా వస్తారో చూస్తామని రేణుకా చౌదరి సవాల్ విసిరారు. ఇక, మాజీ ఎంసీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై రేణుకా చౌదరి హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామంటూనే.. ఎక్కడా దిక్కులేని వారికి కాంగ్రెస్ దిక్కంటూ చురకలంటించారు.

ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో సీబీఐ విచారణను స్వాగతించిన రేణుక

ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో సీబీఐ విచారణను స్వాగతించిన రేణుక

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీబీఐ విచారణ మంచిదేనని రేణుకా చౌదరి స్వాగతించారు. కాంగ్రెస్ పార్టీలో గొడవలు చూసి సిగ్గు పడుతున్నానని అన్నారు. ఇంఛార్జీ వచ్చి సెట్ చేయాల్సిన పరిస్థితి రావడం విచారకరమని వ్యాఖ్యానించారు. రేవంత్ పాదయాత్రలో తాను పాల్గొంటానని చెప్పారు. కాగా, రేవంత్ హాథ్ సే హాత్ జోడో యాత్రను టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి మేడారం నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. తెలంగాణలో మార్పు కోసం తాను ఈ యాత్ర చేపట్టినట్లు రేవంత్ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+