కాంగ్రెస్ పార్టీని వీడను, తప్పుడుప్రచారం: కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

కర్నూల్: తాను పార్టీ మారతానంటూ వచ్చిన వార్తలను కర్నూల్ మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. కర్నూల్‌లో కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి చెప్పారు. టిడిపిలో చేరే ప్రసక్తే లేదని కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ప్రకటించారు. 2019 లో ఏపీలో టిడిపి అధికారంలోకి రాదని కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

I will continue in Congress says Kotla surya prakash reddy

కోట్ల కుటుంబానికి కొన్ని విలువలున్నాయన్నారు. పార్టీ మారతానని గతంలో కూడ వార్తలు వచ్చినట్టు ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఆయన చెప్పారు. తన కుటుంబసభ్యులు కూడ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని చెప్పారు.

రాయలసీమ ప్రయోజనాలను కాపాడడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విఫలమయ్యారని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆరోపించారు. రాయలసీమ ద్రోహిగా చంద్రబాబునాయుడు మిగిలిపోతారని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోనే న్యాయం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. టిడిపి నాయకులు రాష్ట్రాన్ని దోచుకోవడానికే పరిమితమయ్యారని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
There is a spreading a rumour Kurnool MP Kotla Suryaprakash reddy join in Tdp.Former Mp Kotla Surya Prakash Reddy condemns this rumours. He spoke to media on Sunday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి