హంద్రినీవా ప్రాజెక్టు: 'పూర్తయ్యే వరకు పోరాటం చేస్తా'
హైదరాబాద్: హంద్రినీవా ప్రాజెక్టు పూర్తయ్యే వరకు తన పోరాటాన్ని కొనసాగిస్తానని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. హంద్రినీవా ప్రాజెక్టు కోసం రూ. 100 కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

గురువారం నిరాహార దీక్ష విరమించిన అనంతరం వై విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఉరవకొండలో పయ్యావుల కేశవ్ సోదరులు రాజ్యాంగేతర శక్తులుగా వ్వవహరిస్తున్నారని అన్నారు.
హంద్రినీవా ప్రాజెక్టు పూర్తి చేయాలనే డిమాండ్‌తో విశ్వేశ్వరరెడ్డి బుధవారం రోజున దీక్షకు దిగారు. 25 గంటల దీక్ష చేసిన అనంతరం ఎమ్మెల్సీ నారాయణరెడ్డి గురువారం ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.












Click it and Unblock the Notifications