సీమాంధ్ర: రాజధాని రగడ, రాయలసీమ Vs కోస్తా

I will fight for Kurnool as the capital of Seemandhra: Kotala
హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతంలో రాజధాని గొడవ రాజుకుంది. రాజధానిని తమ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని రాయలసీమ, కోస్తా ప్రాంత నాయకులు ఎవరికి వారు పట్టుబడుతున్నారు. పర్యవసానంగా సీమాంధ్రలో ప్రాంతీయ వైషమ్యాలకు ఆజ్యం పోసే పరిస్థితి ఏర్పడుతోంది. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపేసి ఉంటే రాజధాని సమస్య ఉండేది కాదని కోస్తా ప్రాంత నాయకులు అభిప్రాయపడుతున్నారు.

కర్నూలులోనే రాజధాని ఏర్పాటు చేయాలని సీమ నాయకులు డిమాండ్ చేస్తుండడంతో కోస్తా నాయకులు కూడా సమైక్యమవుతున్నారు. తాము కోల్పోయిన రాజధానిని తిరిగి తమకు ఇప్పించాలని సీమ నాయకులు కోరుతున్నారు. సీమ నేతల ఆధిపత్యాన్ని తాము ఇంకా భరించలేమని ఆంధ్ర ప్రాంత నాయకులు నిప్పులు చెరుగుతున్నారు.

రాయలసీమకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైయస్ జగన్మోహన్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వంటి నేతలే రాష్ట్ర విభజనకు కారకులని ఆయా పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఎక్కువ కాలం సీమ నేతలే ముఖ్యమంత్రులుగా ఉన్న అభివృద్ధి జరగక పోవడానికి కారణం ఎవరని ప్రశ్నిస్తున్నారు.

కృష్ణా జిల్లాకు చెందిన ఎన్టీఆర్ హయాంలోనే తెలుగు గంగ ప్రాజెక్టు ప్రారంభమై రాయలసీమలో కొంత మేరకు తాగునీటి సమస్య పరిష్కారమైందని చెబుతున్నారు.

కాగా, అవశేష ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)కు కర్నూలును రాజధానిగా చేయాలని పోరాటాలను ఉద్ధృతం చేస్తామని కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చెప్పారు. విభజన వల్ల రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని, అందుకే రాజధాని సీమకే కేటాయించాల్నారు. విభజన అనంతరం సీమాంధ్రకు కొత్త రైల్వే జోన్ వస్తుందని, సీమకు చెందిన వ్యక్తిగా కొత్త జోన్ కర్నూలులోనే ఉండాలని కోరుకుంటానని చెప్పారు.

కేంద్రమంత్రి కిల్లి కృపారాణి మాట్లాడుతూ... విశాఖను సీమాంధ్రకు రాజధాని చేయాలని కోరుతున్నారు. రాజధానిగా విశాఖ అన్ని విధాలుగా అర్హత కలిగి ఉందంటున్నారు. కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ కూడా ఎప్పటి నుండి ఇదే చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+