డబ్బులకు అమ్ముడుపోయేవాళ్లం కాదు, వైసీపీలో చేరే ప్రసక్తే లేదు: తేల్చేసిన గల్లా అరుణ
చిత్తూరు: తాను పార్టీ మారే ప్రసక్తే లేదని టీడీపీ నేత, చంద్రగిరి ఇంఛార్జీ గల్లా అరుణకుమారి స్పష్టం చేశారు. తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు.
కుటుంబసబ్యుల్లో ఎవరినైనా పోటీలో పెట్టాలని, కుటుంబ సమస్యగా ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు చెప్పానని తెలిపారు. అయితే, తాను పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చాయని అన్నారు. తనను ఎవరూ ఆపలేదని, ఒత్తిడి లేదని చెప్పారు.

కార్యకర్తలు అడిగిన పనిచేయలేకపోయానని గల్లా అరుణ కుమారి అన్నారు. బుధవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. డబ్బుల కోసం పార్టీ మారే నైజం తమకు లేదని అన్నారు.
స్వాతంత్ర్యం రాకముందు నుంచే తమ కుటుంబం రాజకీయాల్లో ఉందని గల్లా అరుణ చెప్పారు. తమ కుటుంబం ప్రజాసేవకే అంకితమని అన్నారు. చంద్రగిరి ఇంఛార్జీ బాధ్యతలు తీసుకోకుంటే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని కార్యకర్తలు చెప్పారని తెలిపారు.
-
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications