రాజీనామా చేసేది లేదన్న పనబాక: నమ్మొద్దని పొన్నం

దీంతో ఆమె స్పందించారు. తాను రాజీనామా చేయనన్నారు. తాను కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసి గెలిచానని, తాను వ్యక్తిగతంగా సమైక్యవాదిని అయినప్పటికీ విభజనపై పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. తాను కాంగ్రెసు పార్టీ టిక్కెట్‌తో గెలిచానన్నారు.
ఎవరైనా విభజనను ఆపగలనని చెబితే వారికి తన రాజీనామా లేఖను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఏఐసిసి ఉపాధ్యక్షురాలు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకే రాష్ట్ర విభజన అన్న విమర్శలను ఆమె ఖండించారు. రాహుల్‌ను ప్రధానిని చేయాలనుకుంటే 2014 దాకా ఆగాల్సిన అవసరం లేదన్నారు.
తన కొడుకు నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నందమూరి తారక రామారావు కుటుంబాన్ని పక్కన పెట్టారని ఆరోపించారు.
సీమాంధ్ర నేతల మాటలు నమ్మొద్దు: పొన్నం
విభజనపై సీమాంధ్ర నేతలు చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ వేరుగా విజ్ఞప్తి చేశారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన విశ్వాసం ఉంచాలన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఆగదన్నారు. రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెసు పార్టీ బాధ్యత అన్నారు.












Click it and Unblock the Notifications