సంచలనం: ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ చంద్రబాబుకు రాయపాటి లేఖ

Posted By:
Subscribe to Oneindia Telugu

గుంటూరు: ఏంపీ పదవికి తాను రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నానని నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు చెప్పారు. ఈ మేరకు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడకు లేఖ రాశారు.

టీటీడి ఛైర్మెన్ పదవిని తనకు ఇవ్వాలని కోరుతూ నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. ప్రస్తుత టీటీడి పాలకవర్గం పదవీకాలం పూర్తైంది. చదలవాడతో పాటు ఆయన పాలకవర్గ సభ్యుల పదవీకాలం పూర్తైంది.

దీంతో కొత్త పాలకవర్గం ఏర్పాటుకు చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నారు. దీంతో రాయపాటి సాంబశివరావు టీటీడి ఛైర్మెన్ పదవి కోసం తన ప్రయత్నాలను మొదలుపెట్టారు.

I will resign for Narsaraopeta seat: Rayapati Sambashiva Rao

ఈ నెల 4వ, తేదిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. అయితే ఈ పర్యటనకు ముందే పాలకవర్గం నియామకం కోసం బాబు కసరత్తు ప్రారంభించారు.

ఈ మేరకు టీటీడి ఛైర్మెన్ పదవిని తనకు కేటాయించాలని రాయపాటి సాంబశివరావు చంద్రబాబుకు లేఖ రాశారు.జోడు పదవులు అడ్డంకిగా మారితే తాను ఎంపీ పదవికి కూడ రాజీనామా చేస్తానని రాయపాటి సాంబశివరావు చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
I will resign for Narsaraopeta mp seat said Rayapati Sambashiva Rao.He wrote a letter to Andhdrapradesh chief minister Chandrababu naidu on Monday.he wants to TTD chairman post.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి