పవన్ పార్టీ పెడితే ఆలోచిస్తా: అలీ, టిడిపితో పొత్తుపై...

అలీ రాజకీయాల్లోకి వస్తారని గత కొంతకాలంగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. అలీ తెలుగుదేశం పార్టీలో చేరి, రాజమండ్రి నుండి పోటీ చేస్తారని గతంలో వార్తలు వచ్చాయి. టిడిపి నేత మురళీ మోహన్ ఆయనతో చర్చలు జరిపినట్లుగా ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఇప్పుడు పవన్ పార్టీ పెడితే ఆలోచిస్తానని అలీ చెప్పడం గమార్హం.
టిడిపితో పొత్తు పైనా
మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పార్టీ వెనుక ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ ఉండవచ్చుననే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. పవన్‌తో పార్టీ పెట్టించి, విజయవాడ టికెట్ ఇప్పించుకుని... విజయం ఖరారయ్యేలా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలంటూ పవన్‌కు పొట్లూరి సూచిస్తున్నారట.
ఇక.. 'రాజకీయం ఎలా ఉండాలి? పేదలకు ఏం చేయాలి? ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎలా వ్యవహరించాలి?' అనే అంశాలపై తన ఆలోచనలకు అనుగుణంగా పవన్ పార్టీ రూపుదిద్దుకుంటోంది. పవన్ కల్యాణ్ రాజకీయ ప్రవేశంకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పవన్ పొలిటికల్ ఎంట్రీ, రాజకీయ భవిష్యత్తు గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 'రాజకీయాలపై మార్చి రెండో వారంలో మాట్లాడతాను' అని పవన్ ఇప్పటికే ప్రకటించారు.












Click it and Unblock the Notifications