బాబుకు మాజీమంత్రి షాకిస్తారా.....టిడిపి నేతల బుజ్జగింపుతో ఇలా..

ప్లీనరీ తర్వాత వైసీపీ నేతల్లో జోష్ కన్పిస్తోంది.అయితే ఇతర పార్టీలనుండి ఫిరాయింపులను కూడ ఆ పార్టీ నేతలు ప్రోత్సహిస్తున్నారు. అయితే అధికారపార్టీలో అసంతృప్తి నేతలకు కూడ వైసీపీ కూడ గాలం వేస్తోంది. అయితే

నెల్లూరు: ప్లీనరీ తర్వాత వైసీపీ నేతల్లో జోష్ కన్పిస్తోంది.అయితే ఇతర పార్టీలనుండి ఫిరాయింపులను కూడ ఆ పార్టీ నేతలు ప్రోత్సహిస్తున్నారు. అయితే అధికారపార్టీలో అసంతృప్తి నేతలకు కూడ వైసీపీ కూడ గాలం వేస్తోంది. అయితే మాజీ మంత్రి , టిడిపినేత ఆదాల ప్రభాకర్‌రెడ్డి టిడిపిని వీడడంలేదని ప్రకటించారు.

తాను వైసీపీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తను మాజీ మంత్రి, టిడిపి నేత ఆదాల ప్రభాకర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. తాను టిడిపిలోనే ఉంటానని ఆయన ప్రకటించారు.గత కొంతకాలంగా ఆయన పార్టీని వీడుతున్నారనే ప్రచారానికి ఆయన గురువారంనాడు తెరదించారు.

former minister adala prabhakar reddy

పార్టీ మారతాననే ప్రచారంలో వాస్తవం లేదని ఆదాల ప్రభాకర్ రెడ్డిప్రకటించారు. ఈ మేరకు ఆయన గురువారంనాడు మీడియాతో మాట్లాడారు. వైసీపీలోకి వెళ్ళాల్సిన దుస్థితిలో తాను లేనన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే వైసీపీని వ్యతిరేకించినట్టు చెప్పారు,

తనపై వైసీపీ నేతలు కావాలనే దుష్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. టిడిపి తనకు సరైన స్థానం ఇచ్చిందని ఆదాల ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభాకర్‌రెడ్డికి ఎమ్మెల్సీ టిక్కెట్టు ఇవ్వలేదని అలక చెందినట్టు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

ఎమ్మెల్సీ టిక్కెట్టు కోసం ఆదాల ప్రయత్నించారని, చివరకు టిడిపి అధిష్టానం వాకాటి నారాయణరెడ్డి సీటును కేటాయించారని గతంలో జిల్లాలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ వ్యవహరంలో ప్రభాకర్‌రెడ్డిని మంత్రులు బుజ్జగించినట్టు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+