జయప్రద..రోజా ఇప్పుడు నేను : అంతా ఆయనే చేశారు- కన్నీటితో టీడీపీ పై దివ్యవాణి ఫైర్..!!
దివ్యవాణి టీడీపీకి రాజీనామా చేసారు. చంద్రబాబు కు ఈ మేరకు తన రాజీనామా లేఖ పంపారు. తాను రాజీనామాకు దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఏడాది కాలంగా తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గుతూ వచ్చిందన్నారు. అచ్చెన్నాయుడు లాంటి నేత పార్టీ లేదు బొక్కా లేదన్నా..ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. బుద్ధిట లేని వాళ్లు.. బుద్ధిలేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. ప్యాకేజీ అందిందని.. అందుకే రాజీనామా చేయడం లేదంటున్నారని పేర్కొన్నారు.

ప్యాకేజీలు - మేకప్ లు వేసుకొని మాట్లాడలేదు
చివరి నిమిషం వరకూ క్లారిటీ తీసుకునేందుకే ఆగానని దివ్యవాణి తెలిపారు. సినీ నటుడు పెట్టిన పార్టీలో యాక్టర్లు నాడు జయప్రద..జయసుధ..రోజా..ఆలీ..ఈ రోజు తాను పార్టీలో కరివేపాకులా మారామని ..ఇప్పుడు తీసి పారేసారని చెప్పుకొచ్చారు. తాను ఎప్పుడూ ఎవరికీ భజన చేయలేదని చెప్పుకొచ్చారు. తన సమస్యను లోకేశ్ దృష్టికి తీసుకెళితే.. జనార్ధన్‌కు చెప్పమన్నారని వివరించారు. తాను టీడీ జనార్ధన్ ను ప్రశ్నించినందుకే..కొందరిని రెచ్చగొట్టి తనతో మాట్లాడించారని ఆరోపించారు. మహానాడు లో తాను మాట్లాడనివ్వకుండా అవమానించారంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

ఆయన్ను ప్రశ్నించినందుకే నరకం
టీడీ జనార్దన్ అనే వ్యక్తిని ప్రశ్నించినందుకు నరకం చూపిస్తారా అంటూ నిలదీసారు. డబ్బులు..ప్యాకేజీలు తీసుకొని తాను నారీ భేరీలు నిర్వహించలేదని..మేకప్ వేసుకొని మీడియా సమావేశాలు పెట్టలేదని వ్యాఖ్యానించారు. తనను పార్టీలోకి తీసుకొచ్చిన అంబికా క్రిష్ణ సైతం తనకు ఫోన్ చేసి బయటకు వచ్చేయి.. కరివేపాకులా మారుతావంటూ ముందే చెప్పారని దివ్య వాణి వివరించారు. పదవుల కోసం తానెప్పుడూ ప్రాకులాడలేదని చెప్పుకొచ్చారు. పార్టీ కోసం తాను రూపాయి తీసుకోకుండా పని చేసానని..తన కోసం ఏ ఒక్కరూ చంద్రబాబు వద్దకు వెళ్లి మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేసారు.

నాడు జయప్రద..రోజా..ఇప్పుడు తనతో అంటూ
తాను భజన చేసేందుకు సిద్దంగా లేనన్నారు. టీడీపీకి మనసాక్షిగా ఉంటే జయప్రద.. జయసుధ.. ఆలీ ఇప్పటికే పార్టీలోకి తిరిగి వచ్చేసేవారంటూ దివ్యవాణి చెప్పుకొచ్చారు. తాను చంద్రబాబును కలిసి పరిస్థితి వివరించాలని భావించానని.. చాలా సేపు నిరీక్షించినా సమయం దొరకలేదన్నారు. చివరకు తాను కలిసిన సమయంలో తన పైన చంద్రబాబు అసహనం వ్యక్తం చేసారని..కానీ, తాను సీరియస్ గా తీసుకోలేదని చెప్పుకొచ్చారు. తన భవిష్యత్ రాజకీయ అడుగులు ఎటు అన్నది అప్పుడే చెప్పలేనని..పలువరు తనతో టచ్ లో ఉన్నారని దివ్యవాణి స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications