Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వెస్టిండీస్‌పై విజయవాడ క్రికెటర్ తేజ నిడమానూరు విధ్వంసం: వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో

విజయవాడ: ఐసీసీ వరల్డ్ కప్..క్వాలిఫయర్స్‌లో సంచలనం నమోదైంది. వెస్టిండీస్ నిర్దేశించిన 374 పరుగుల భారీ లక్ష్యాన్ని పసికూన నెదర్లాండ్స్ సమం చేసింది. అనంతరం జరిగిన సూపర్ ఓవర్‌లో కరేబియన్ కింగ్స్‌ను మట్టికరిపించింది. సూపర్ ఓవర్‌లో ఏకంగా 30 పరుగులను పిండుకుంది నెదర్లాండ్స్. ఈ లక్ష్యాన్ని వెస్టిండీస్ అందుకోలేకపోయింది. ఎనిమిది పరుగులకే చతికిలపడింది.

జింబాబ్వే రాజధాని హరారే స్పోర్స్ట్ క్లబ్ స్టేడియంలో కొద్దిసేపటి కిందటే ముగిసిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ నిప్పులు చెరిగింది. ఆకాశమే హద్దుగా చెలరేగింది. వెస్టిండీస్ వీరులను మట్టి కరిపించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 374 పరుగులను అందుకున్న తరువాత సూపర్ ఓవర్‌లో 30 పరుగులను పిండుకుంది నెదర్లాండ్స్. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో చేతులెత్తేసింది విండీస్. ఎనిమిది పరుగులే చేయగలిగింది.

Teja Nidamanuru

తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ నికొలస్ పూరన్ సెంచరీ బాదాడీ మ్యాచ్‌లో. 65 బంతుల్లో ఆరు సిక్సర్లు, తొమ్మిది ఫోర్లతో 104 పరుగులు చేశాడు. బ్రెండన్ కింగ్- 76, జాన్సన్ ఛార్లెస్- 54, షమారా బ్రూక్స్- 25, షై హోప్- 47, చివర్లో కీమో పాల్- 46తో స్టేడియంలో పరుగుల వరద పారింది.

ఈ భారీ టార్గెట్‌ను ఛేదించడానికి బరిలోకి దిగిన పసికూన నెదర్లాండ్స్ ఏ మాత్రం అదరలేదు.. బెదరలేదు. తొలి ఓవర్ నుంచే విరుచుకుపడింది. విక్రమ్‌జీత్ సింగ్- 37, మ్యాక్స్ ఓడౌడ్- 36, వెస్లీ బర్రెసీ- 27, బాస్ డీ లెడె- 33 పరుగులు చేశారు. అతనికి కేప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 47 బంతుల్లో 67 పరుగులు చేశాడు. చివర్లో ఆల్‌రౌండర్ లొగాన్ వాన్ బీక్- 28, ఆర్యన్ దత్- 16 పరుగులతో చివరి వరకూ పోరాడారు. ఫలితంగా- నెదర్లాండ్స్ కూడా నిర్ణీత 50 ఓవర్లల్లో సరిగ్గా 374 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ మిడిలార్డర్ బ్యాటర్ తేజ నిడమానూరు సెంచరీతో చెలరేగాడు. 76 బంతుల్లో మూడు సిక్సర్లు, 11 మెరుపుల్లాంటి ఫోర్లతో 111 పరుగులు చేశాడు. ప్రత్యర్థి బౌలర్ల విరుచుకుపడ్డాడు. వారి దుమ్ము దులిపాడు. అతని బ్యాటింగ్ ధాటికి విండీస్ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. భారీగా పరుగులను సమర్పించుకున్నారు బౌలర్లు. అంతర్జాతీయ మ్యాచ్ లను ఆడిన అనుభవం తక్కువే అయినప్పటికీ ప్రొఫెషనల్ ఆటతీరును కనపర్చాడు.

Teja Nidamanuru

అతని పూర్తి పేరు అనిల్ తేజ నిడమానూరు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇటీవలే అడుగు పెట్టాడు. నెదర్లాండ్స్‌కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నాడు. ఆ దేశ జాతీయ జట్టులో ఆల్ రౌండర్. అతని స్వస్థలం విజయవాడ. 1994 ఆగస్టు 22వ తేదీన విజయవాడలో జన్మించాడు. అనంతరం అతని కుటుంబం నెదర్లాండ్స్‌లో స్థిరపడింది. క్రికెట్‌ను తన కేరీర్‌గా ఎంచుకున్నాడు తేజ.

గతంలో అక్లాండ్, అక్లాండ్ ఏ జట్ల తరఫున ఆడాడు. కుడిచేతి వాటం బ్యాటర్. కుడిచేతి వాటం ఆఫ్ బ్రేక్ బౌలర్ కూడా. ఇప్పటివరకు 16 వన్డే ఇంటర్నేషనల్స్, ఆరు టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. వన్డేల్లో ఇది అతనికి రెండో సెంచరీ. ఇదివరకు జింబాబ్వేపై తొలి సెంచరీ సాధించాడు. ఇప్పుడు తాజాగా తేజ సాధించిన సెంచరీ.. విండీస్‌పై జట్టు విజయానికి కారణమైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+