ఖాతాదారులకు ఐసిఐసిఐ బ్యాంకు షాక్.. ఇక మినిమం బ్యాలెన్స్ 50 వేలు!
ఐసిఐసిఐ బ్యాంకు ఖాతాదారులకు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసిఐసిఐ బ్యాంక్ తన సేవింగ్స్ ఖాతాలో కనీస సగటు బ్యాలెన్స్ ను మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఐసిఐసిఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్స్ మినిమం బ్యాలెన్స్ నిబంధనలో భారీ పెంపు చేస్తున్నట్టు ప్రకటించింది.
ఖాతాదారులకు షాక్ ఇచ్చిన ఐసిఐసిఐ
ఈ భారీ పెంపు ఆగస్టు ఒకటవ తేదీ నుండి అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల ఖాతాదారులకు మాత్రమే కాక, సెమీ అర్బన్, అర్బన్, మెట్రో ఖాతాదారుల పైన కూడా తీవ్ర ప్రభావం పడనుంది. ఇక ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో దేశీయ బ్యాంకులలో అత్యధిక కనీస సగటు బ్యాలెన్స్ ఐసిఐసిఐ బ్యాంక్ ది అవుతుంది.

మెట్రో, పట్టణాల్లో మినిమం బ్యాలెన్స్ 50 వేలు
మెట్రో మరియు పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులు ఇంతకుముందు పదివేల రూపాయలు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే సరిపోయేది కానీ ప్రస్తుతం పెంచిన మినిమం బ్యాలెన్స్ ప్రకారం ఖాతాదారులు ఇప్పుడు 50 వేల రూపాయలు కనీస నిల్వ ఉంచాలి. ఇక సెమీ, అర్బన్ బ్రాంచ్ లలో కనీస బ్యాలెన్స్ 5000 రూపాయల నుండి 25 వేల రూపాయలకు పెరిగింది.
గ్రామీణ, సెమీ అర్బన్ ఖాతాదారులపై ప్రభావం
అలాగే గ్రామీణ బ్రాంచ్ లలో మినిమం బ్యాలెన్స్ 2500 రూపాయల నుంచి పదివేల రూపాయలకు పెంచింది. ఈ భారీ పెంపు ముఖ్యంగా గ్రామీణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాలలోని కస్టమర్ల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఇక బ్యాంకు నిబంధనల ప్రకారం అవసరమైన మొత్తంలో బ్యాలెన్స్ జరిమానా విధించాల్సి రావచ్చు.
మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చెయ్యకుంటే ఫైన్
ఇక అవసరమైన కనీస నెలవారి సగటు బ్యాలెన్స్ ను నిర్వహించడంలో విఫలమైన కస్టమర్లకు ఆరు శాతం లేదా 500 రూపాయలు ఏది తక్కువ అయితే అది జరిమానా విధించనుంది . అయితే కస్టమర్ నమోదు చేసుకున్న ప్రోగ్రాం ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే ఈ చార్జీలు మాఫీ చేయబడతాయి అని బ్యాంకు తెలిపింది.












Click it and Unblock the Notifications