ఉద్దానం ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్- 6.2 కోట్ల నిర్ణయం..!
ఏపీలో ఉత్తరాంధ్ర ప్రజలకు కేంద్రం ఇవాళ ఓ శుభవార్త చెప్పింది. ముఖ్యంగా దశాబ్దాలుగా కిడ్నీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఉద్దానం ప్రాంత వాసులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. కిడ్నీ సమస్యలకు మూలకారణం కనుక్కునేందుకు వీలుగా పరిశోధనలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అంగీకరించింది. అంతేకాదు ఇందుకోసం నిధుల కేటాయింపుతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో సమస్యగా మారిన కిడ్నీ వ్యాధుల మూలాలపై పరిశోధన చేపట్టేందుకు ఐసీఎంఆర్ ఆమోదం తెలిపిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. మూడేళ్ల కాల వ్యవధిలో ఈ పరిశోధన పూర్తిచేసేందుకు మూడు దశల్లో ఐసీఎంఆర్ రూ.6.2 కోట్లను గ్రాంటు రూపంలో ఇస్తుందని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం వైద్య ఆరోగ్య శాఖ ఉద్ధానంలో పరిశోధన నిమిత్తం ఐసీఎంఆర్ తో ఈ ఏడాది మార్చి నుంచి జరిపిన సంప్రదింపులు ఫలించాయని మంత్రి తెలిపారు.

ఐసీఎంఆర్ 'డిపార్టుమెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్' కింద పరిశోధన నిర్వహణకు తాజాగా ఆమోదం తెలపడాన్ని మంత్రి సత్యకుమార్ స్వాగతించారు. "శ్రీకాకుళం కిడ్నీ రీసెర్చ్ ప్రాజెక్ట్" పేరుతో జరిగే ఈ పరిశోధనలో భాగంగా పరీక్షించే వారిలో ఒకటి, రెండు సంవత్సరాల్లో కిడ్నీ వ్యాధుల బారినపడే వారిని గుర్తించి, ముందుగానే చికిత్స అందించేందుకు అవకాశమేర్పడుతుందని మంత్రి పేర్కొన్నారు. అలాగే కిడ్నీ వ్యాధుల మూలాలు కనుగొనడం ద్వారా ఉద్దానం ప్రాంతంలో అవసరమైన చర్యలు తీసుకోవడానికి వీలవుతుందన్నారు. అతి త్వరలోనే ఈ పరిశోధన ప్రారంభమవుతుందని తెలిపారు.
వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మాజీ వీసీ, సీనియర్ నెఫ్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ రవిరాజ్ మార్గదర్శకంలో ఆంధ్ర వైద్య కళాశాల ద్వారా నెఫ్రాలజీ హెచ్ఓడి ప్రొఫెసర్ జి.ప్రసాద్ పంపిన ప్రతిపాదనలు పరిగణనలోనికి తీసుకుని పరిశోధనకు ఐసీఎంఆర్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉద్దానంలో ర్యాండం విధానంలో 18 ఏళ్లకు పైబడిన వారిలో 5,500 మంది నుంచి రక్త, మూత్ర నమూనాలు సేకరిస్తారు. మూత్ర నమూనాలను ఆధునిక బయోమార్కర్స్ విధానంలో పరీక్షిస్తారు. దీనివల్ల బాధితులకు ఒకటి, రెండు సంవత్సరాల్లో కిడ్నీ సమస్య ఏ స్థాయిలో రావచ్చనేది స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం కొత్త మందులు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల బాధితులు ముందుగానే మేల్కొని వ్యాధులు ముదరకుండా జాగ్రత్తపడే అవకాశం ఉందని, ఉద్దానంలో గతంలో అధ్యయనం చేసిన డాక్టర్ రవిరాజ్ తెలిపారు.

అలాగే ఆర్ఎన్ఎ సీక్వెన్సింగ్ విధానంలో జన్యుపరమైన పరీక్షలు కూడా ఈ పరిశోధనలో భాగంగా చేస్తామని తెలిపారు. దీనివల్ల బాధితులకు జన్యుపరంగా కిడ్నీ వ్యాధులు వస్తాయా? రావా? అని కూడా తెలుస్తుందని పేర్కొన్నారు. ఉద్దానంలో ప్రతి వంద మందిలో 18% మంది కిడ్నీ పనితీరు సక్రమంగా లేదని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇక్కడ మాదిరిగా కేసులు లేవన్నారు. రక్త, మూత్ర నమూనాలు పరీక్షించేందుకు ఐసీఎంఆర్ ఆంధ్ర వైద్య కళాశాల లో ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటుచేస్తుంది. వీటి పరికరాలు/యంత్రాలు ఐసీఎంఆర్ ద్వారా వైద్య కళాశాలకు రానున్నాయి. కొత్తగా సాంకేతిక నిపుణులు, రీసెర్చ్ నిపుణులను నియమిస్తారు. తొలి ఏడాది రూ.3.04 కోట్లు, రెండో ఏడాది రూ.1.75 కోట్లు, మూడో ఏడాది రూ.1.21 కోట్లు చొప్పున ఐసీఎంఆర్ నిధులు మంజూరు చేస్తుంది. ఈ నిధులతోనే ల్యాబ్ ఏర్పాటవుతుంది. వేతనాలు చెల్లింపులు జరుగుతాయి.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications