అటవి శాఖ అనుమతి ఇస్తే వెంటనే అలిపిరి టూ తిరుమలకు అనుమతి, టీటీడీ చైర్మన్!
తిరుమల/తిరుపతి: అలిపిరి (tirupati) నుండి తిరుమలకు (tirumala) నడచి వచ్చే నడక మార్గంలో వన్య మృగాల నుండి ఎలాంటి ముప్పు లేదని అటవీ శాఖ అధికారులు ధృవీకరిస్తేనే 12 ఏళ్ళ లోపు పిల్లల విషయంలో ఆంక్షలు సడలిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేశారు. భక్తుల భద్రతే తమకు ముఖ్యమని టీటీడీ (TTD) చైరన్ భూమన కరుణాకర రెడ్డి (karunakara redd) చెప్పారు.
తిరుమలలో (tirumala) భక్తుల రద్దీ నేపథ్యంలో సోమవారం టీటీడీ (TTD) చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి శ్రీవారిని దర్శించుకోవడానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్ బయట వేచి ఉన్న క్యూ లైన్లను పరిశీలించారు. భక్తులకు ఆహారం, తాగునీరు, కాఫీ, టీ, మజ్జిగ సరైన సమయంలో అందుతున్నాయా లేదా ? అని టీటీడీ చైర్మన్ కరుణాకర రెడ్డి (karunakara reddyభక్తులను అడిగి తెలుసుకున్నారు.

భక్తులకు ఎలాంటి చిన్న ఇబ్బంది కలగకుండా మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను టీటీడీ చైర్మన్ కరుణాకర రెడ్డి ఆదేశించారు. గోగర్భం సర్కిల్ నుండి కృష్ణతేజ సర్కిల్ వరకు క్యూ లైన్లను కరుణాకర రెడ్డి (karunakara reddyపరిశీలించారు. అనంతరం టీటీడీ చైర్మన్ కరుణాకర రెడ్డి (reddy) మీడియాతో మాట్లాడారు. (tirumala)పెరటాశి మాసం, సెలవుల కారణంగా గత నాలుగు రోజులుగా తిరుమలలో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని కరుణాకర రెడ్డి అన్నారు.

తిరుమలలో (tirumala) వైకుంఠం క్యూకాంప్లెక్స్ లు నిండిపోయి క్యూ లైన్లు 4 నుండి 5 కిలో మీటర్ల దూరం వెళ్లాయని, ఇలాంటి సమయంలో భక్తులకు త్వరితగతిన స్వామి వారి దర్శనం చేయించాలనే సంకల్పం తో వీఐపీ బ్రేక్ , సుపథం, స్లాటెడ్ దర్శనం టోకెన్ల జారీ కూడా రద్దు చేసినట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి (reddy) చెప్పారు. క్యూ లైన్లలో ఉండే భక్తులు ఎక్కడా అసహనానికి లోను కాకుండా అవసరమైన తగిన వసతులు కల్పించామని కరుణాకర రెడ్డి చెప్పారు.

అక్టోబరు 15వ తేదీ నుండి తిరుమలలో (tirumala) జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారనే అంచనాతో అవసరమైన ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకుంటుంటున్నామని టీటీడీ చైర్మన్ కరుణాకర రెడ్డి (reddy) తెలిపారు. టీటీడీ అధికారుల పనితీరు బ్రహ్మాండంగా ఉందని భక్తులు (tirumala)కూడా అంటున్నారని కరుణాకర రెడ్డి మీడియాకు చెప్పారు.
విపరీతమైన భక్తుల రద్దీ ఉండటంతో ఈవో, జేఈవో, సీవీఎస్వో, ఆరోగ్యం ఇతర అధికారులందరూ ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ క్యూలైన్లు పరిశీలిస్తూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని టీటీడీ (tirumala)చైర్మన్ కరరుణాకర రెడ్డి (reddy) మీడియాకు చెప్పారు. తిరుమలకు భక్తులు పోటెత్తడంతో వీరు ప్రత్యక్షంగా ఏర్పాట్లు పరిశీలిస్తూ భక్తులకు చిన్న ఇబ్బంది కూడా కలడగకుండా పని చేస్తున్నారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి (reddy) వారిని అభినందించారు.












Click it and Unblock the Notifications