బాబును తిట్టి కేసీఆర్ గట్టెక్కితే ... కేసీఆర్ ని తిట్టి బాబు గట్టెక్కలేరా .. ?

అమ‌రావ‌తి/హైదరాబాద్ : కూట‌మి గెలిస్తే.. మ‌ళ్లీ చంద్ర‌బాబు మాటే చెల్లుబాట‌వుతుంది. రాష్ట్రం విడిపోయాక కూడా పెత్త‌నం చేయాల‌నుకుంటే ఎలా అంటూ 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల్లో చంద్ర‌శేఖ‌ర్ రావు.. సెంటిమెంట్ పండించి గెలుపును సులువు చేసుకున్నారు. అంతే కాకుండా త‌న‌కు వ్య‌తిరేకంగా త‌న రాష్ట్రంలో విమ‌ర్శించ‌టాన్ని అంత తేలిక‌గా తీసుకోలేదు. బ‌దులు తీర్చుకుంటానంటూ జ‌గ‌న్ భుజం మీద నుంచి చంద్ర‌బాబుకు గురిపెట్టారు చంద్ర‌శేఖ‌ర్ రావు. ఇంత‌కీ ఇదే త‌ర‌హాలో ఏపిలో కేసీఆవ‌ర్ ను దూషిస్తే ఓట్లు రాలుతాయా అనేదే ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

 ఆస‌క్తిగా మారిన తెలుగు రాజ‌కీయాలు..! ప‌ర‌స్ప‌ర ఆరోప‌ణ‌ల‌తో ద‌ద్ద‌రిల్లుతున్న ప్ర‌చారాలు..!!

ఆస‌క్తిగా మారిన తెలుగు రాజ‌కీయాలు..! ప‌ర‌స్ప‌ర ఆరోప‌ణ‌ల‌తో ద‌ద్ద‌రిల్లుతున్న ప్ర‌చారాలు..!!

ఇంత వ‌ర‌కూ గ‌తం. మ‌రి ఇప్పుడు చంద్ర‌బాబు కూడా ఏపిలో ఇదే త‌ర‌హాలో ముందుకు వెళ్తున్నారు. జ‌గ‌న్ గెలిస్తే చంద్ర‌శేఖ‌ర్ రావు పెత్త‌నమే ఏపీలో చెల్లుబాట‌వుతుంది. సామంతులుగా ఉందామా? ఆత్మాభిమానం నిల‌బెట్టుకుందామా? అంటూ బాబు కూడా అదే సెంటిమెంట్‌తో ఏపీ ఓట‌ర్ల బావోద్వేగాల‌కు ప‌రీక్ష పెడుతున్నారు. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. కానీ.. చంద్ర‌బాబును తెలంగాణ ప్ర‌జ‌లు వ్య‌తిరేకించినంత‌గా. ఏపీ ప్ర‌జ‌లు చంద్ర‌శేఖ‌ర్ రావు ను వ్య‌తిరేకిస్తున్నారా? అనేది అస‌లు పాయింట్. అటువంటి వాతావ‌ర‌ణం ఏపీలో అంత‌గా క‌నిపించ‌డం లేద‌ని చెప్పాలి.

 తెలంగాణ‌లో బాబును టార్గెట్ చేసిన కేసీఆర్..! ఏపిలో కేసీఆర్ ప్ర‌స్తావ‌న తెస్తున్న బాబు..!!

తెలంగాణ‌లో బాబును టార్గెట్ చేసిన కేసీఆర్..! ఏపిలో కేసీఆర్ ప్ర‌స్తావ‌న తెస్తున్న బాబు..!!

ఎందుకంటే తెలంగాణ‌లో ఉద్య‌మ నేప‌థ్యం.. ఏపీ నేత‌ల ప‌రిపాల‌న అనుభ‌వాలు ఉన్నాయి. కానీ.. ఏపీలో అటువంటి ఘ‌ట‌న‌లు లేవ‌నే చెప్పాలి. ఒక‌వేళ నాగార్జున‌సాగ‌ర్ నీటిని రాకుండా చేస్తార‌ని.. పోల‌వ‌రం అడ్డుకుంటార‌ని.. అమ‌రావ‌తి రాజ‌ధాని మార్చుతారంటూ ప్ర‌చారం చేసినా.. ఈ మూడింట్లో కేసీఆర్ ప్ర‌మేయం ఎంత‌వ‌ర‌కూ ఉంటుంద‌నేది కూడా ఓట‌ర్లు ఆలోచిస్తారు. ఒక‌వేళ నీటి వాటా విష‌యంలో స‌రిహ‌ద్దు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో త‌గాదాలు వ‌చ్చినా ట్రిబ్యునల్స్‌, దానికంటూ న్యాయ వ్య‌వ‌స్థ ఉండ‌నే ఉన్నాయి.

 కేసీఆర్ జ‌గ‌న్ మైత్రీ బంధం..! వైసీపికి శ‌రాఘాతం..!!

కేసీఆర్ జ‌గ‌న్ మైత్రీ బంధం..! వైసీపికి శ‌రాఘాతం..!!

కేసీఆర్‌, జ‌గ‌న్ మైత్రి ఉండ‌టం వ‌ల్ల సానుకూలంగా రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు న‌డిచేందుకు అవ‌కాశం ఉంద‌ని వాదిస్తున్న‌వారూ ఏపీలో లేక‌పోలేదు. చంద్రబాబు మాత్ర‌మే చంద్రశేఖ‌ర్ రావును విమ‌ర్శిస్తున్న స‌మ‌యంలో ప‌వ‌న్ కూడా గొంతుక‌లిపాడు. ఏపీ రాజ‌కీయాల్లో కేసీఆర్ జోక్యం ఉండ‌కూడదంటూ సూచ‌న‌లు చేశారు. ఇద్ద‌రు నేత‌లు, కేసీఆర్‌ను శ‌త్రువుగా చూప‌టం వ‌ల్ల ఏపీ ప్ర‌జ‌లు జ‌గ‌న్‌ను ఏపీ ద్రోహిగా చూస్తార‌నేది రెండు పార్టీల ఆలోచ‌న‌. ఒక‌వేళ జ‌గ‌న్ కూడా కేసీఆర్‌ను తిట్ట‌డం మొద‌లుపెడితే.. అప్పుడు చంద్ర‌బాబు, ప‌వ‌న్‌లు ఇంకెవ‌ర్ని తిట్టాలంటూ వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

 జ‌గ‌న్ ను అడ్డుపెట్టుకుని ఏపిలో కేసీఆర్ రాజ‌కీయం..! తిప్పికొట్టే ప‌నిలో తెలుగు త‌మ్ముళ్లు..!!

జ‌గ‌న్ ను అడ్డుపెట్టుకుని ఏపిలో కేసీఆర్ రాజ‌కీయం..! తిప్పికొట్టే ప‌నిలో తెలుగు త‌మ్ముళ్లు..!!

చంద్ర‌శేఖ‌ర్ రావు అభివృద్ధి.. సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌ధానంగా చేసుకుని ముంద‌స్తు ఎన్నిక‌లు వెళ్లారు. చంద్ర‌బాబు ప్ర‌చారానికి రావ‌టంతో కేవ‌లం త‌మ‌కు చీలే ఓట్ల‌ను కాపాడుకునేందుకు మాత్ర‌మే బాబును విమ‌ర్శించామంటూ టీఆర్ ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. ఇక ఎపి లో జ‌గ‌న్ కు మ‌ద్ద‌త్తు తెలుపుతూ చంద్ర‌బాబును ప‌రోక్షంగా దెబ్బ‌తీయాల‌నుకుంటే ఎదురించి తీరుతాం అంటున్నారు తెలుగు త‌మ్ముళ్లు. అదే వాస్తవాన్ని ప్ర‌జ‌ల‌కు చెప్పే క్ర‌మంలో చంద్ర‌శేఖ‌ర్ రావు పేరు ప్ర‌స్త‌వించాల్సివ‌స్తోంద‌ని తెలుగుదేశం నేత‌లు చెప్పుకొస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+