రైలు ప్రయాణంలో మద్యం తీసుకువెళ్లవచ్చా?
రైలులో ప్రయాణించేటప్పుడు మనకు ఇష్టం ఉన్నా, లేకపోయినా పలు నియమాలను పాటించాల్సి ఉంటుంది. కొంతమంది ప్రయాణికులు మద్యం సేవించి రైలు ఎక్కుతారు. మరికొందరు తమతోపాటు రైలులో మద్యం తీసుకొని ప్రయాణిస్తారు. రైలులో జర్నీ చేసేటప్పుడు మద్యం తీసుకువెళ్లవచ్చా? లేదా? అనే విషయాన్ని తెలుసుకుందాం.
మద్యం విషయంలో వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు నిబంధనలు అమల్లో ఉంటాయి. రైలులో మద్యం తీసుకువెళ్లడం అనేది మీరు ప్రయాణించే రాష్ట్రంపై ఆధారపడి ఉంటుంది. రైల్వే అధికారి సమాచారం అందించకుండా రైలు, మెట్రో లేదా బస్సు వంటి రవాణా సౌకర్యాల ద్వారా మద్యం ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి తీసుకువెళ్లకూడదు. అయితే రైలులో మద్యం తీసుకువెళ్లడం పూర్తి నిషిద్ధమని ఉన్నతాధికారులు తెలిపారు. ఎవరైనా మద్యం సేవించి రైలు ఎక్కితే వారిపై కఠినచర్యలు తీసుకుంటారు.

500 జరిమానా..
ఇండియన్ రైల్వే యాక్ట్ 1989లో సెక్షన్ 165 ప్రకారం చర్యలు తీసుకుంటారు. మద్యమే కాకుండా నిషేధిత వస్తువులతో ప్రయాణం చేస్తున్నట్లయితే అతనిపై రూ.500 జరిమానా విధిస్తారు. అంతేకాకుండా ఆ వస్తువులవల్ల రైల్వేకు ఏమైనా నష్టం వాటిల్లితే దాన్ని కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది. దేశంలో బీహార్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో రూల్స్ అమలు చేయించే విషయంలో ఎంతో కఠినంగా ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో మద్యంతో పట్టుబడితే న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటారు. జరిమానా కూడా పడుతుంది. ఒక రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి ప్రయాణం చేస్తున్నట్లయితే పన్ను ఎగవేత కేసు కూడా నమోదు కావచ్చు. పట్టుబడిన వ్యక్తిని జీఆర్ఫీకి అప్పగించి, ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు.












Click it and Unblock the Notifications