ఐబొమ్మలో సినిమాలు చూస్తుంటే సమస్యల్లో పడినట్లే?
ప్రస్తుతం మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్న అందరికీ ఐబొమ్మ వెబ్ సైట్ గురించి తెలియకుండా ఉండదు.ఓటీటీలో విడుదలయ్యే సినిమాలను దాదాపుగా అదే నాణ్యతతో ఉచితంగా వినియోగదారులకు అందిస్తోంది. దీంతో చాలామంది ఈ వెబ్ సైట్ ద్వారా సినిమాలను డౌన్ లోడ్ చేసుకొని పైసా ఖర్చు లేకుండా కొత్త కొత్త కంటెంట్ ను ఉచితంగా చూస్తున్నారు.
ఐబొమ్మ ద్వారా డౌన్ లోడ్ చేసుకొని సినిమాలు చూడటమంటే సమస్యల్లో ఇరుక్కున్నట్లే అనే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి ఐ బొమ్మ వెబ్ సైట్ ను ఎవరు నడుతున్నారు? ఎక్కడి నుంచి నడుపుతున్నారు? ఎక్కడ అప్ లోడ్ చేస్తున్నారు? లాంటి ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకడంలేదు.

అయితే దీని నిర్వాహకులు విదేశాల్లో ఉంటారని తెలుస్తోంది. వెబ్ సైట్ డొమైన్ బ్లాక్ చేసినా వెంటనే మరో డొమైన్ బుక్ చేసుకొని మరీ సినిమాలను అప్ లోడ్ చేస్తున్నారు. ఈ సైట్ వల్ల నిర్మాతలు మోసపోవడంతోపాటు తీవ్రంగా నష్టపోతున్నారు. ఐబొమ్మపై చర్యలు తీసుకోవాలని ప్రయత్నించినప్పటికీ వారిని పట్టుకోవడం సాధ్యపడటంలేదు.
అంతేకాదు.. ఈ సైట్ నుంచి సినిమాలు డౌన్ లోడ్ చేస్తే వాళ్ల వైరస్ కూడా డౌన్ లోడ్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ సైట్ ఓపెన్ చేసే సమయంలో వేరే సైట్ కు సంబంధించిన లింక్స్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంటాయి.వాటివల్ల కూడా మన వివరాలు బయటకు వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే ఐబొమ్మలో సినిమాలు చూడటం ప్రమాదమనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications