అంధుల కోటాలో ఐఎఫ్ఎస్: ఇద్దరు భార్యలకు టోకరా, మూడో పెళ్లి
నెల్లూరు: ఓ ఐఎఫ్ఎస్ అధికారి నీతిమాలిన చర్యకు దిగాడు. ఇద్దరు భార్యలను మోసగించి, తన కూతురు వయస్సున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా నెల్లూరులోని తన ఇంట్లో పెద్ద యెత్తున పార్టీ చేసుకున్నాడు. లగ్జరీ కార్లలో పెద్దపెద్ద వాళ్లు ఈ పార్టీకి వచ్చారు.
నెల్లూరు రూరల్ మండలం పుండ్లపూడిలో నివాసం ఉంటున్న శ్రీనివాసులు అంధుల కోటాలో ఐఎఫ్ఎస్ అధికారి అయ్యాడు. గతంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న సమయంలో సుధ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. కట్న కానుకలు బాగానే తీసుకున్నాడు. అయితే ఆమె ఆరోగ్యం సరిగా లేదంటూ మధ్యలోనే వదిలేశాడు. తర్వాత మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకూ విడాకులిచ్చాడు.
ఇప్పుడు కూతురు వయసుండే మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో సన్నిహితులకు గ్రాండ్‌గా పార్టీ ఇచ్చాడు. దీనికి పెద్దపెద్ద వాళ్లు చాలా మంది వచ్చారు. వీఐపీలు వెళ్తూ వస్తున్న గుమ్మం ముందు మొదటి భార్య సుధ ఆమె తల్లి న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. అయితే ఎవరూ వారిని పట్టించుకోలేదు.

పోలీసులు సైతం వారిని అక్కడి నుంచి నెట్టేశారు. వీరు ఆందోళన కొనసాగిస్తున్న సమయంలోనే మరికొంతమంది బాధితులు ఇంటివద్దకు చేరుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ తమ వద్ద రూ.లక్షలు తీసుకున్నారని వారు ఆరోపించారు.
ఫోన్లలో తన శారీరకవాంఛను తీర్చమంటూ వేధించేవాడని తెలిపారు. గత నెల 24వ తేదీన పలువురు మహిళలు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో శ్రీనివాసులురెడ్డిపై ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు కాలేదు. పోలీసులు సర్దిచెప్పి పంపించారు.












Click it and Unblock the Notifications