వివాహితతో అక్రమ సంబంధం: పురుగుల మందు తాగి ఆత్మహత్య!..

చంద్రగిరి మండలానికి చెందిన ఓ వివాహితతో కొన్ని నెలల క్రితం అతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది.

తిరుపతి: వివాహేతర సంబంధం ఓ జంటను ఆత్మహత్యకు పాల్పడేలా పురిగొల్పింది. ఘటనలో యువకుడు మృతి చెందగా.. యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. చంద్రగిరి మండలం బోడిగుట్టవారిపల్లె గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. బోడిగుట్టవారిపల్లెకు చెందిన కుమార్ (27) తిరుపతిలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. చంద్రగిరి మండలానికి చెందిన ఓ వివాహితతో కొన్ని నెలల క్రితం అతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో సోమవారం నాడు వీరిద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు.

illicit affair: couple attempts suicide in tirupati

విషయాన్ని గమనించిన స్థానికులు.. ఇద్దరిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో.. కుమార్ అప్పటికే మృతి చెందాడు. దీంతో అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు. కుమార్ ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+