Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అతలాకుతలం, అత్యంత భారీ వర్షాలు - తాజా హెచ్చరికలు.!!

ఆకాశానికి చిల్లు పడిండా అన్నట్లు వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలు జిల్లాల్లో గంట వ్యవధిలోనే 5 నుంచి 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వాగులకు వరదలు వచ్చి నదులుగా మారుతున్నాయి. అతి భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో బీభత్సమే మిగిలింది. పలు ప్రాంతాలకు ముంపు ముప్పు పొంచింది. అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.

అతి భారీ వర్షాలు :తెలంగాణకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ లో అతి భారీ వర్షం పైన అధికారులు అప్రమత్తం చేసారు. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, యాదాద్రి-భువనగిరి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

IMD Alerts heavy rain fall in many parts of ap and Telangana for next three days, Holidays for schools

రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ నాగరత్న తెలిపారు. జూన్‌ 1 నుంచి బుధవారం నాటికి 313.9 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 416.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు చెప్పారు. సాధారణం కంటే దాదాపు 33 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదైందని, మరో వారంపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలతో మరింత అధిక వర్షపాతం రికార్డు అయ్యే అవకాశం ఉన్నదని వెల్లడించారు.

మూడు రోజుల పాటు:మరో మూడు రోజులు వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి రుతుపవన ద్రోణి బుధవారం తోడైంది. దీని ప్రభావంతో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయి.

మత్స్యకారులెవ్వరూ చేపలవేటకు వెళ్లదని హెచ్చరించింది. 27న పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. మరో రెండు రోజులు వర్ష తీవ్రత ఎక్కువగా ఉన్నందున పాత భవంతులను వీడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని హెచ్చరించింది.

పాఠశాలలకు సెలవులు:ఏపీలోని నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి జిల్లాలకు రెడ్ అలెర్ట్ గా ప్రకటించారు. రానున్న 48 గంటల పాటు భారీ నుండి అతిభారీ వర్షాలు‌ కురుస్తాయని హెచ్చరిక జారీ చేశారు. ఏపీలోని మిగిలిన జిల్లాలో రానున్న రెండు రోజులు మోస్తారు నుండి అతి భారీ వర్షాలు‌ కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. క్రిష్ణా, గోదావరి జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో అక్కడి జిల్లా యంత్రాంగం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. గోదావరి వరద భద్రాచలంను వణికిస్తోంది. గంట గంటకు వరద తీవ్రత పెరుగుతోంది రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. జలాశయాల వద్ద అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+