అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్.!!
ఏపీలో భారీ వర్షాల పై హెచ్చరికలు జారీ అయ్యాయి. నైరుతి బంగాళాఖాతం మీదుగా సగటున సముద్ర మట్టానికి 3.1 కి.మీ వరకు ఆవర్తనం విస్తరించి ఉందని దీని ప్రభావంతో గురువారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ వెల్లడించింది. అల్పపీడనం శుక్రవారానికి వాయుగుండంగా బలపడనుంది. కోస్తా జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మూడు రోజులు వర్షాలు
అల్పపీడన ప్రభావంతో ఈ రోజు నుంచి మూడు రోజల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. మే 23, గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

ఈ జిల్లాలకు అలర్ట్
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మంగళవారం రాష్ట్రంలో అనంతపురం జిల్లా నార్పలలో 26.5, చిత్తూరులో 22.5, చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో 21.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఐఎండీ అంచనాలు
అదే విధంగా శుక్రవారం అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, కాకినాడ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. శ్రీకాకుళం,విజయనగరం,పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications