దూసుకొస్తున్న తుఫాను, అత్యంత భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తీవ్ర హెచ్చరిక..!!
తుఫాను ముంచుకొస్తోంది. వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రానున్న మూడు రోజులు అత్యంత భారీ వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొద్దిరోజుల్లో తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఆర్నాబ్ తుఫాను పై వాతావరణ శాఖ కీలక హెచ్చరిక చేసింది. ఏపీతో పాటుగా తెలంగాణ జిల్లాల్లో నూ ఈ తుఫాను ప్రభావం ఉండనుంది. ఈ నెల 28వ తేదీకి వాయుగుండ తుఫానుగా మారి ఏపీ తీరానికి చేరనుంది. దీంతో.. ఏపీతో పాటుగా తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదే విధంగా జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ నెల 27 నుంచి 29 వరకు చాలా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ పేర్కొంది. ఎల్నినోతో కొద్ది రోజులుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కాగా, ప్రస్తుతం వాతావరణంలో కొద్దికొద్దిగా మార్పు వస్తోంది.

మూడు రోజులు భారీ వర్షాలు
కాగా.. గత రెండు రోజులుగా వాతావరణంలో మార్పు కనిపిస్తోంది. శుక్రవారం నుంచి కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. పలు జిల్లాల్లో కొంత మేర చలిగాలులు వీస్తున్నట్లు వెల్లడించారు. అయితే.. అటు అర్నాబ్ తుఫాను దూసుకొస్తోంది. తుపానుగా మారిన తర్వాత 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అల్పపీడనం శనివారం రాత్రికి వాయుగుండంగా బలపడింది. ఇది కాకినాడకు 910 కి.మీ., విశాఖకు 820 కిలోమీటర్లు, బాపట్లకు 1,100 కి.మీ., మచిలీపట్నానికి 1,020 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. తర్వాత పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఆదివారానికి మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుంది. బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ తీర సమీపానికి చేరుకొని బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. దీంతో.. ఏపీ.. తెలంగాణ ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.













Click it and Unblock the Notifications
