42 ఏళ్ల తర్వాత దళిత వాడలోకి దేవత రథం.. మంత్రులే స్వయంగా తాళ్లు

సామాజిక అసమానతలను పటాపంచలు చేస్తూ, సమతా మమతల వేదికగా ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. తమిళనాడులోని చారిత్రక నగరం కాంచీపురం జిల్లా వాలాజాబాద్ సమీపంలోని పుత్తగరం గ్రామంలో ఏకంగా 42 ఏళ్ల తర్వాత గ్రామ దేవత రథం దళితుల నివాస ప్రాంతంలోకి అడుగుపెట్టింది. స్థానిక అరుళ్‌మిగు శ్రీ ముత్తు కొలక్కి అమ్మవారి ఆలయ రథోత్సవంలో భాగంగా ఆదివారం నిర్వహించిన ప్రయోగాత్మక రథయాత్ర (ట్రయల్ రన్) స్థానిక దళిత వాడ గుండా అత్యంత వైభవంగా సాగింది. దశాబ్దాలుగా వేచి చూసిన ఈ చారిత్రాత్మక ఘట్టంతో ఆ ప్రాంతంలో ఆనందోత్సాహాలు విరబూసాయి.

శ్రీశైలం ఆలయంలో చురుగ్గా కార్తీకమాసం ఏర్పాట్లు: స్పర్శ దర్శనాలపై.. !!
శ్రీశైలం ఆలయంలో చురుగ్గా కార్తీకమాసం ఏర్పాట్లు: స్పర్శ దర్శనాలపై.. !!

వివాదాలు, కోర్టు తీర్పుల దాటి ముందుకు కదిలిన రథం!

ఈ రథయాత్ర వెనుక పెద్ద పోరాటమే ఉంది. అమ్మవారి రథం తమ వీధుల గుండా కూడా వెళ్లాలని దళిత వర్గానికి చెందిన ప్రజలు చాన్నాళ్లుగా కోరుతున్నారు. అయితే గ్రామాల్లోని కొందరు దీనిని తీవ్రంగా వ్యతిరేకించడంతో రథం వెళ్లే మార్గంపై వివాదం నెలకొంది. ఈ క్రమంలో పసరై సెల్వరాజ్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. రథాన్ని దళిత వాడలోకి కూడా అనుమతించాలని సంచలన తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ రకరకాల కారణాల వల్ల ఇన్నాళ్లూ రథోత్సవం నిలిచిపోయింది. తాజాగా జిల్లా యంత్రాంగం చొరవతో మళ్లీ చక్రాలు ముందుకు కదిలాయి.

Kanchipuram Temple Chariot Enters Dalit Locality After 42 Years Historic Trial Run Held in Tamil Nadu

మంత్రుల చేతుల మీదుగా ప్రారంభం.. భారీ పోలీస్ భద్రత!

జిల్లా పరిపాలనాధికారుల పర్యవేక్షణలో ఆదివారం ఈ ప్రయోగాత్మక రథయాత్రను అట్టహాసంగా ప్రారంభించారు. తమిళనాడు ప్రభుత్వం తరఫున ప్రవాస తమిళుల సంక్షేమ శాఖ మంత్రి తంగం తెన్నరసు, అటవీ శాఖ మంత్రి రంజిత్ కుమార్ స్వయంగా పాల్గొని రథం తాళ్లను లాగి ఈ రథయాత్రను ప్రారంభించారు. ఊరిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ అరవిందన్ ఆధ్వర్యంలో 200 మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నలుగురు డిఎస్పీలు, ఇద్దరు ఏఎస్పీలు, 10 మంది ఇన్‌స్పెక్టర్ల పర్యవేక్షణలో రథం గ్రామంలోని అన్ని వీధుల గుండా సురక్షితంగా సాగి ఆలయానికి చేరుకుంది.

దసరా వేళ శుభవార్త.. రూ.2,500 కోట్లతో రాష్ట్రవ్యాప్త ఆలయాల ఆధునీకరణ!
దసరా వేళ శుభవార్త.. రూ.2,500 కోట్లతో రాష్ట్రవ్యాప్త ఆలయాల ఆధునీకరణ!

చెండా మేళాలు, దివ్య దీపారాధనలతో ఘన స్వాగతం!

సుదీర్ఘమైన 42 ఏళ్ల నిరీక్షణ తర్వాత తమ గడప ముందుకు వచ్చిన అమ్మవారి రథాన్ని చూసి దళితవాడ ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు. చెండా మేళాలు, దప్పుల వాయిద్యాలు, మంగళ వాయిద్యాల మోతలతో గ్రామం సంతోషంలో మునిగిపోయింది. గ్రామస్థులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, దివ్య దీపారాధనలు సమర్పించారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ రథం తాడు పట్టుకుని లాగుతూ ఆధ్యాత్మిక పండగను జరుపుకున్నారు. ఈ ఘటన తమిళనాడు సామాజిక చరిత్రలో ఒక గొప్ప మార్పుగా నిలిచిపోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+